ఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా మీడియాపై కీలక వ్యాఖ్యలు చేసింది. తీవ్రమైన సంఘటనలు జరిగినప్పుడు వాటిని ప్రసారం చేయడం, వాటిపై వ్యాఖ్యనాలు, మాట్లాడే స్వేచ్ఛ మీడియాకు ఉంటుందని ముగ్గురు సభ్యులు గల ధర్మాసనం వ్యాఖ్యానించింది. కాగా అదే సమయంలో సదరు వ్యక్తిది తప్పు లేదా ఒప్పు అని నిర్దారించే హక్కు మాత్రం మీడియాకు లేదని తెలిపింది.

దిశ హత్య అనంతరం నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేస్తుండా నిందితులు ఎదురు తిరగడంతో వారిపై కాల్పులు జరిపారు. ఈ ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టులో మూడు పిటిషన్లు దాఖలు అయ్యాయి. ఈ పిటిషన్లపై సుప్రీం చీఫ్‌ జస్టిస్‌ ఎస్‌.ఎ.బాబ్డే, జస్టిస్ బి.ఆర్‌.గవాయ్‌, జసిస్ట్‌ సూర్యాకాంత్‌లో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. దిశ ఘటన అనంతరం మీడియా చేసిన ప్రసారాలపై తీవ్ర అభ్యంతరం తెలుపుతూ ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాకు ఇచ్చిన నోటీసులను న్యాయవాది కోర్టుకు సమర్పించారు. న్యాయవాదులు జి.ఎస్.మణి, ఎం.ఎల్.శర్మ, ముకేష్ కుమార్ శర్మలు దిశ ఎన్‌కౌంటర్‌పై పిటిషన్లు దాఖలు చేశారు.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.