దిశ నిందితుడి ఇంట్లో తీవ్ర విషాదం..
By తోట వంశీ కుమార్ Published on 9 March 2020 3:27 PM IST
‘దిశ’హత్యాచారం కేసులో నిందితుడు, పోలీస్ ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన చెన్నకేశవులు ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. చెన్నకేశవులు ఘటన మర్చిపోకముందే ఆ కుటుంబానికి పెద్ద షాక్ తగిలింది. చెన్నకేశవులు తండ్రి కురుమయ్య మృతి చెందాడు.
గత డిసెంబర్‌లో నారాయణ్ పేట్ జిల్లా మక్తల్ మండలం జక్లేర్ గ్రామంలో బైక్‌పై వెళ్తున్న కురుమయ్యను ఇన్నోవా వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన హైదరాబాద్‌లో కొన్ని రోజుల పాటు చికిత్స పొందాడు. కొన్ని రోజుల క్రితమే కురమయ్య కుటుంబ సభ్యులు ఆయన్ని స్వగ్రామం నారాయణపేట జిల్లా గుడిగండ్లకు తీసుకువెళ్లారు.
కాగా సోమవారం మధ్యాహ్నం సమయంలో తన ఇంట్లోనే మృతి చెందారు. చెన్నకేశవులు భార్య రేణుక రెండు రోజుల క్రితమే ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.ఆయన మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Next Story