స్టేజ్ పై డ్యాన్స్ చేసి షాక్ ఇచ్చిన 'వ‌ర్మ‌'

By Newsmeter.Network  Published on  25 Dec 2019 5:50 PM IST
స్టేజ్ పై డ్యాన్స్ చేసి షాక్ ఇచ్చిన వ‌ర్మ‌

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ తాజా చిత్రం బ్యూటీఫుల్. ఈ చిత్రానికి అగ‌స్త్య మంజు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. జ‌న‌వ‌రి 1న ఈ సినిమాని రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ నైనా గంగూలీ విసిరిన స‌వాల్‌కు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మొదటి సారి స్టేజ్ మీద నైనా గంగూలీతో క‌లిసి డాన్స్ వేసి ఆమెకు బ‌దులివ్వ‌డం విశేషం. ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్ నెట్ లో వైరల్ గా మారింది.

ఈ వేడుక‌లో వ‌ర్మ మాట‌లు ఆయ‌న మాట‌ల్లోనే... బ్యూటిఫుల్ నాకు చాలా స్పెషల్ ఫిలిం. నేను రంగీలా సినిమా తీయడానికి ముఖ్యకారణం ఊర్మిళ. ఊర్మిళ లాంటి అమ్మాయి లేకుంటే నేను రంగీలా సినిమా తీసుండేవాణ్ణి కాదు. అదే ఇప్పుడు నైనా విషయంలో జరిగింది. కొంత మంది యాక్టర్స్ కొన్ని ప్రత్యేక మైన క్యారెక్టర్స్ కోసమే క్రియేట్ అయ్యారనిపిస్తుంది. ఈ సినిమా కాస్టింగ్ కోసం చూస్తున్నప్పుడు అదే జరిగింది. అగస్త్యమంజు మీద నాకెప్పుడూ చాలా నమ్మకం ఉంటుంది. సిన్సియర్ గా వర్క్ చేస్తారు. ఈ లవ్ స్టోరీని ఒక కొత్త పంథాలో సరికొత్తగా చూపించారు.

నట్టి కుమార్‌, అంజయ్య గారితో కలిసి ఈ సినిమా చేశాం. వారికి ధన్యవాదాలు. సూరి మొదటి సినిమా అయినా ఏ మాత్రం తగ్గకుండా సూపర్ గా చేశారు. రవిశంకర్ ఫంటాస్టిక్ మ్యూజిక్ ఇచ్చారు. బ్యూటిఫుల్ అనేది నాకు తెలిసిన ఒక అమ్మాయికి సంబందించిన కథ. నేను గత పది పదిహేనేళ్లుగా లవ్ స్టోరీ జోలికి వెళ్ళలేదు. దానికి రెండు కారణాలు ఒకటి నన్నుఅంతగా ఇన్స్పైర్ చేసిన కథ రాలేదు. రెండు నన్ను అంతగా ఇన్స్పైర్ చేసిన యాక్టర్ దొరకలేదు.

అవి రాగానే ఈ సినిమా మొదలుపెట్టాం. బ్యూటిఫుల్ అంటే మనసుకి ఆహ్లాదం కలిగించి మనల్నిఉద్రేకానికి గురిచేసే ఏ ఎమోషన్ అయినా బ్యూటిఫుల్. నేను నా హిట్ ని ఎంత బ్యూటిఫుల్ గా తీసుకుంటానో నా ప్లాఫ్ ని కూడా అంతే బ్యూటిఫుల్ గా తీసుకుంటాను. నా లైఫ్ లో ఎవరి మీద కంప్లైంట్ చేయను.. నాకు ఎవరిమీద కోపం రాదు. నేను బ్యూటిఫుల్ కాక పోవచ్చు కానీ నా లైఫ్ మాత్రం బ్యూటిఫుల్ గా గడిపాను అని వ‌ర్మ‌ అన్నారు.

Next Story