సాయి ధరమ్ తేజ్, రాశిఖన్నా జోడిగా యువ దర్శకుడు మారుతీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా సినిమా 'ప్రతిరోజు పండగే'.

ప్రముఖ నటుడు సత్యరాజ్ ఒక ముఖ్యపాత్రలో నటిస్తున్న ఈ సినిమా నుండి టైటిల్ ట్రాక్ ని యూట్యూబ్ లో రిలీజ్ చేశారు.

సినిమాలోని ఒక సందర్భంలో కుటుంబమంతా కలిసి ఎంతో ఆనందంగా కలిసి మెలిసి పాడుకునే ఈ పాటకు సంగీత దర్శకుడు ఎస్.ఎస్ థమన్ ఆకట్టుకునే ట్యూన్ ని అందించగా, కేకే అద్భుతమైన సాహిత్యాన్ని సమకూర్చడం జరిగింది.

ఇక అందరిని ఎంతో అలరించే విధంగా యువ గాయకుడు శ్రీకృష్ణ గాత్రం, పాటకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది అనే చెప్పాలి.

ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్ లో శ్రోతలను విశేషంగా అలరిస్తూ మంచి వ్యూస్ తో దూసుకుపోతోంది.

కుటుంబంలో బంధాలు, అనుబంధాల నేపథ్యంలో ఆకట్టుకునే కథ, కథనాలతో దర్శకుడు మారుతీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.

గీతా ఆర్ట్స్, యువి క్రియేషన్స్ బ్యానర్లపై యువ నిర్మాత బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా జయకుమార్ పని చేస్తుండగా, సహా నిర్మాతగా ఎస్ కె ఎన్ వ్యవహరిస్తున్నారు.

ఇప్పటికే చివరి దశ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను క్రిస్మస్ పండుగ కానుకగా డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.

న్యూస్‌మీటర్ తెలుగు

Next Story