బ్రేకింగ్ : కాసేపట్లో మ్యాచ్.. కెప్టెన్సీకి కార్తీక్ గుడ్‌బై
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 16 Oct 2020 10:55 AM GMT
ఐపీఎల్-2020కి సంబంధించి నేడు అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. మరికాసేపట్లో ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్ జరుగనుండగా కోల్‌కత్తా నైట్‌రైడర్స్ జట్టు కెప్టెన్ దినేష్ కార్తీక్.. ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. దీంతో నైట్‌రైడర్స్‌కు కొత్త కెప్టెన్‌గా ఇయాన్ మోర్గాన్ వ్యవహరించనున్నట్లు ఆ జట్టు సీఈవో వెంకీ మైసూర్ తెలిపారు.
ఈ సీజన్‌లో నైట్‌రైడర్స్ జట్టు దినేష్ కార్తీక్ కెప్టెన్సీలో ఏడు మ్యాచ్‌లు ఆడి నాలుగు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో నైట్‌రైడర్స్ జట్టు ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉంది. అయితే.. డీకే కెప్టెన్సీపై ఇటీవల తీవ్ర విమర్శలొచ్చాయి. ఓడిపోయిన మూడు మ్యాచ్‌లకు కార్తీక్ కెప్టెన్సీ బాధ్యతలను సరిగ్గా నిర్వర్తించకపోవడమే కారణమన్న విమర్శలు వచ్చాయి.
అలాగే.. కార్తీక్ ఈ సీజన్‌లో బ్యాటింగ్‌లోనూ అంతగా రాణించలేదు. ఇప్పటివరకూ 108 పరుగులు మాత్రమే చేశాడు. కార్తీక్ కెప్టెన్సీ నుంచి డీకే తప్పుకోవడానికి ఇదే ప్రధాన కారణంగా తెలుస్తుంది. ఇక 2018 నుంచి దినేష్ కార్తీక్ కేకేఆర్ జట్టు కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. నూతన కెప్టెన్ మోర్గాన్ కూడా కెప్టెన్సీలో అనుభవం ఉంది. 2019లో ఇంగ్లాండ్‌కు వరల్డ్ కప్ అందించిన రికార్డు ఉంది.