ప్రభాస్ పై ఒత్తిడి పెంచుతోన్న దిల్ రాజు.. ఇంతకీ దేని కోసం..?
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 31 Oct 2019 3:12 PM ISTయంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన 'సాహో' సినిమా ఆశించిన విజయాన్ని సాధించకపోవడంతో ఇప్పుడు రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా పైనే దృష్టి పెట్టాడు. గోపీకృష్ణా మూవీస్ సమర్పణలో యు.వి. క్రియేషన్స్ సంస్థ ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. నవంబర్ నుంచి తాజా షెడ్యూల్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే... ప్రభాస్ తదుపరి చిత్రాలకు సంబంధించి కథలు వింటున్నాడు కానీ.. ఇంకా ఏ సినిమాని ఫైనల్ చేయలేదు.
అయితే.. ప్రభాస్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఒత్తిడి పెంచుతున్నారు అని ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తోంది. ఇంతకీ విషయం ఏంటంటే... ప్రభాస్ తో దిల్ రాజు మున్నా, మిస్టర్ పర్ ఫెక్ట్ చిత్రాలను నిర్మించారు. ఇప్పుడు ఓ భారీ చిత్రాన్ని నిర్మించాలి అనుకుంటున్నాడట. బాహుబలి రిలీజ్ తర్వాత నుంచి ప్రభాస్ తో సినిమా చేసేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడట కానీ.. ప్రభాస్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదట.
తాజా వార్త ఏంటంటే... ప్రభాస్ కి సైరా డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఓ స్టోరీ చెప్పాడట. దీనికి ప్రభాస్ సానుకూలంగానే స్పందించినట్టు తెలిసింది. ప్రభాస్ - సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో రూపొందే ఈ భారీ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించనున్నారు అని వార్తలు వస్తున్నాయి. మరి.. ప్రచారంలో ఉన్న ఈ వార్త నిజమా..? కాదా..? అనేది తెలియాల్సివుంది.