దిల్‌రాజ్ పెళ్లిఫోటోలు వైర‌ల్‌..

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 May 2020 11:53 AM IST
దిల్‌రాజ్ పెళ్లిఫోటోలు వైర‌ల్‌..

టాలీవుడ్ ప్ర‌ముఖ నిర్మాత దిల్‌రాజ్ రెండో పెళ్లి చేసుకున్నారు. ఆదివారం రాత్రి 11.30గంట‌ల‌కు నిజామాబాద్‌లో ఆయ‌న వివాహాం జ‌రిగింది. అతి కొద్ది మంది అతిథుల సమక్షంలో అత్యంత నిరాడంబంరంగా ఈ పెళ్లి జరిగింది. ఓ బ్రాహ్మణ యవతిని ఆయన పెళ్లాడారని సమాచారం. దిల్ రాజు పెళ్లికి పెద్దగా ఆమె కూతురు హన్షిత రెడ్డి అన్నీ తానై చూసుకుంది.

శ్రీ వెంటేశ్వ‌ర క్రియేష‌న్స్ ట్విటర్ ఖాతా వేదిక‌గా దిల్‌రాజ్ ఆదివారం ఉద‌యం ఓ ట్వీట్ పెట్టారు. 'ప్ర‌పంచం మొత్తం ఉన్న క్లిష్ట ప‌రిస్థితుల్లో మ‌న‌లోని చాలా మంది వృత్తిప‌రంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ‌తకొంత‌కాలంగా నా వ్య‌క్తిగ‌త జీవితంలో ఎలాంటి సంతోషం చోటుచేసుకోలేదు. ఈ క్లిష్ట ప‌రిస్థితుల‌న్నీ త్వ‌ర‌లోను చెదిరిపోయి మ‌ళ్లీ మ‌నం సాధార‌ణ‌, అంద‌మైన జీవితాల్లోకి అడుగుపెడ‌తామ‌ని ఆశిస్తున్నాను. అలాంటి ఆశ‌తోనే నా వ్య‌క్తిగ‌త జీవితాన్ని పునఃప్రారంభించ‌డానికి ఇది స‌రైన స‌మ‌యంగా బావిస్తున్నాను' అని దిల్ రాజ్ తెలిపారు.

దిల్ రాజ్ భార్య అనిత అనారోగ్యం కార‌ణంగా మూడేళ్ల క్రితం మ‌ర‌ణించ‌గా.. ఆయ‌న ఒంటరిగా జీవిస్తున్నారు. కాగా.. ప్ర‌స్తుతం దిల్ రాజ్ పెళ్లి ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి. ప్ర‌స్తుతం ఆయ‌న ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టిస్తున్న 'వ‌కీల్‌సాబ్' చిత్రానికి నిర్మాత‌గా వ్య‌వ‌హారిస్తున్నారు.

Dil Raju marriage photos Viral

వివాహం చేసుకున్న తండ్రికి హన్షితా రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. 'నాన్నా.. అన్ని సమయాల్లోనూ నువ్వు నాకు అతి పెద్ద బలంగా నిలిచావు. ఎప్పుడూ నాకు అండగా ఉన్నందుకు ధన్యవాదాలు. మన కుటుంబ సంతోషమే నీకు అతి ముఖ్యమైనది. జీవితంలో కొత్త ప్రయాణం ప్రారంభించిన మీరిద్దరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా. ప్రతి రోజూ నీకు అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నా. నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నా' అంటూ హన్షిత పేర్కొన్నారు.

Dil Raju marriage photos Viral

Next Story