Fact Check : టెన్నిస్ బాల్ తో విన్యాసాలు చేస్తోంది మారడోనానా..?
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 6 Jun 2020 3:59 AM GMTకరోనా కట్టడి కోసం.. ప్రపంచ వ్యాప్తంగా లాక్ డౌన్ ను అమలుచేస్తూ ఉన్నారు. ఈ మధ్యనే కొన్ని సడలింపులను తీసుకుని వచ్చారు. దీంతో కొందరు మైదానాల్లోనూ, కోర్టుల్లోనూ తిరిగి అడుగుపెడుతూ ఉన్నారు. ప్రస్తుతం ఓ లావుపాటి వ్యక్తి టెన్నిస్ బాల్ ను కాలితో తంతూ.. చేసిన విన్యాసానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. టెన్నిస్ కోర్టులో ఆయన అంత శరీరంతోనూ బంతి కింద పడకుండా చేసిన విన్యాసం హైలైట్.
ఈ వీడియోలో ఉన్నది ప్రముఖ ఫుట్ బాల్ దిగ్గజం డియాగో మారడోనా అంటూ పలువురు షేర్లు చేయడం మొదలుపెట్టారు. క్షణాల్లోనే ఆ వీడియో వైరల్ అయ్యింది.
వైరల్ అయిన వీడియో లింక్
https://facebook.com/watch/?v=569442200378661
వీడియో స్క్రీన్ షాట్ ను కూడా ఇక్కడ చూడొచ్చు:
నిజ నిర్ధారణ:
టెన్నిస్ బాల్ తో మారడోనా విన్యాసాలు చేసారంటూ పెట్టిన పోస్టులు అబద్ధం.
ఈ వీడియోకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ను తీసుకుని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. ఈ వీడియో లాక్ డౌన్ కంటే ముందే సోషల్ మీడియాలో ఉంది. లాక్ డౌన్ తర్వాత వీడియోను అప్లోడ్ చేశారనడం 'అబద్ధం'.
ఇంకా వెతకగా ఒరిజినల్ వీడియో కూడా దొరికింది. యుట్యూబ్ లో క్లిప్పింగ్ కనిపించింది.
అక్టోబర్ 24, 2015న ఈ వీడియోను జానీ ఆండ్రూస్ ఈ వీడియోను అప్లోడ్ చేశాడు.
ఇటాలియన్ కామెడీ డ్రామా అయిన 'యూత్' అనే సినిమా ట్రైలర్ లోనిది ఆ వీడియో. పావులో సొరెంటీనో డైరెక్ట్ చేశాడు. సినిమాకూ డియాగో మారడోనాకు ఎటువంటి సంబంధం లేకపోయినా.. ఈ క్యారెక్టర్ ను ఆయన స్ఫూర్తిగానే సృష్టించినట్లు తెలుస్తోంది.
రోలె సెర్రానో అనే నటుడు ఈ పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. సెర్రానో వీపు మీద కార్ల్ మార్క్స్ ట్యాటూ ఉండగా.. మారడోనా కుడి బైసెప్స్ మీద చెగువేరా ట్యాటూ ఉంటుంది. అలాగే లెఫ్ట్ హ్యాండర్ అయిన నటుడు 'హ్యాండ్ ఆఫ్ ది గాడ్' గోల్ గురించి కూడా ప్రస్తావించారు.
Clip: I am left-handed too- https://www.youtube.com/watch?v=vtl-MOaxMNI
మారడోనాను ఇన్స్పిరేషన్ గా తీసుకుని చిత్రీకరించిన సీన్- https://www.youtube.com/watch?v=ayXURbmujEg
టెన్నిస్ బాల్ తో మారడోనా విన్యాసాలు చేసారంటూ పెట్టిన పోస్టులు అబద్ధమని స్పష్టంగా తెలుస్తోంది. మారడోనా లాగా ఉన్న వ్యక్తి చేసిన విన్యాసాలు కూడా ఇప్పటివి కావు.
లాక్ డౌన్ తర్వాత మారడోనా టెన్నిస్ బాల్ తో ఆడుకున్నారన్నది 'అబద్ధం'.