ప్రపంచంలోనే అతిపెద్ద డైమండ్‌ హబ్‌లో భారీ చోరీ జరిగింది. పెద్ద మొత్తంలో దుండగులు వజ్రాలను అపహరించుకుపోయారు. ఈ ఘటన గుజరాత్‌ రాష్ట్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దాదాపు రూ.3 కోట్ల విలువైన వజ్రాలను ఎత్తుకుపోయారని వజ్రాల ఫ్యాక్టరీ యాజమాన్యం తెలిపింది. వజ్రాలను మేనేజర్‌కు అప్పగించకుండా నమ్మకస్తులైన కార్మికులే ఈ పని చేశారని యాజమాన్యం పేర్కొంది. సూరత్‌లోని కత్రాంగాం పరిధిలో ఈ దొంగతనం జరిగింది. పటేల్‌ ఫాలియాలోని అతి పెద్ద డైమండ్‌ హబ్‌లో ఇద్దరు కార్మికులు చాలా కాలంగా నమ్మకంగా పని చేస్తున్నారు. వారిని నమ్మిన అక్కడి యాజమాన్యం 1200 క్యారెట్లకు పైగా ఉన్న 3 వజ్రాలను హెచ్‌వీకే సంస్థకు ఇవ్వాల్సిందిగా ఆ కార్మికులకు ఇచ్చింది. ఇదే అదనుగా భావించిన కార్మికులు వజ్రాలతో పరారు అయ్యారు. ఈ ఘటనపై యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న గుజరాత్‌ పోలీసులు సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు.

అంజి గోనె

Next Story