(#DhoniRetires) అంటూ సోషల్ మీడియాలో హల్ చల్..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  29 Oct 2019 1:09 PM GMT
(#DhoniRetires) అంటూ సోషల్ మీడియాలో హల్ చల్..!

మహేంద్ర సింగ్‌ ధోని.. ఈ పేరు క్రికెట్‌ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. ఐసీసీ ప్రధాన టోర్నీలను ఎకైక భారత కెప్టెన్‌ ధోని. 2004లో క్రికెట్‌లో అరగేంట్రం చేసిన ధోని తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇలా ధోని గురించి ఎంత చెప్పినా తక్కువే. వరల్డ్‌కప్‌ టోర్నీ అనంతరం ధోని ఆర్మీలో చేరాడు. ఆర్మీ ట్రైనింగ్‌ తర్వాత ధోని క్రికెట్‌ టీమ్‌లో చేరలేదు. అయితే గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో ధోని రిటైర్మెంట్‌ పలు ఉహాగానాలు మొదలయ్యాయి. దీనికి తోడుగా ట్విటర్‌లో ట్రెండింగ్‌లో ఉన్న (#DhoniRetires) హ్యాష్‌ట్యాగ్‌ను చూసిన క్రికెట్‌ అభిమానులు ఒక్కసారిగా షాక్‌ అయ్యారు. మంగళవారం ఉదయం నుంచి ట్విటర్‌లో ఇది టాప్‌-10 ట్రెండింగ్‌లో ఉంది. దీంతో ధోని క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించడంటూ ఫేక్‌ వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. అయితే ధోని మాత్రం వీడ్కోలు వార్తలను ఖండిస్తున్నారు. మరికొందరు 'నెవర్‌రిటైర్‌ ధోని' 'థ్యాంక్యూ ధోని' హ్యష్‌ ట్యాగ్‌లతో ట్వీట్లు చేస్తున్నారు. ఈ హ్యష్‌ ట్యాగ్‌ నకిలీదని తెలియడంతో ఫ్యాన్స్‌ ఊపిరిపీల్చుకున్నారు. ధోని వచ్చే సంవత్సరం జరగనున్న టీ20 వరల్డ్‌కప్‌ వరకు ఆడాలని అభిమానులు కోరుకుంటున్నారు. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గుంగూలీ కూడా ధోని రిటైర్మెంట్‌ను తనకే వదిలేశాడు. ధోనిని ఫేర్‌వెల్‌ మ్యాచ్‌ ఆడించి ఘనంగా రిటైర్మెంట్‌ ఇవ్వాలని క్రీడా విశ్లేషకులు సూచిస్తున్నారు.

Next Story