ధ‌నుష్ తూటా వ‌చ్చేది ఎప్పుడు..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  22 Nov 2019 12:55 PM GMT
ధ‌నుష్ తూటా వ‌చ్చేది ఎప్పుడు..?

హీరో ధనుష్, దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్ తొలిసారి కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఎనై నోకి పాయుమ్ తోట. ఈ తమిళ చిత్రాన్ని తెలుగులో తూటా పేరుతో అనువదిస్తున్నారు. మేఘ ఆకాష్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి ఇందులో అతిథి పాత్రలో నటిస్తున్నారు. ఈ రొమాంటిక్ థ్రిల్లర్ కు దర్భుక శివ సంగీతం అందిస్తుండగా.. మనోజ్ పరమహంస, ఎస్ఆర్ కాథిర్, జామన్ టి జాన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

ఈ మధ్యే విడుదలైన ట్రైలర్, టీజర్‌కు అద్భుతమైన స్పందన వస్తుంది. సినిమా నవంబర్ 29న భారీగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు. విజయభేరి వారి బ్యానర్ పై జి తాత రెడ్డి, జి సత్యనారాయణ రెడ్డి ఈ చిత్రం తెలుగు హక్కులను కొనుగోలు చేశారు.

ధనుష్, మేఘా ఆకాశ్ జంట‌గా న‌టించిన ఈ చిత్రానికి రచన, దర్శకత్వం: గౌతమ్ వాసుదేవ్ మీనన్, నిర్మాతలు: జి తాత రెడ్డి, జి సత్యనారాయణ రెడ్డి, సంగీతం: ధర్భుక శివ, సినిమాటోగ్రఫీ: మనోజ్ పరమహంస, జామన్ టి జాన్, ఎస్ఆర్ కాథిర్, ఎడిటర్: ప్రవీణ్ ఆంటోని, ఆర్ట్ డైరెక్టర్: రాజీవన్

మాటలు: శశాంక్ వెన్నెలకంటి, లిరిక్స్: అనంత శ్రీరామ్, చైతన్య ప్రసాద్, పబ్లిసిటీ డిజైన్స్: విక్రమ్ డిజైన్స్

Next Story