ఏ దానం చేస్తే ఏ ఫలితం?.. వెండి, బంగారం దానం చేస్తే?

పుణ్య కార్యాల్లో దానం అతి గొప్పది. అయితే కొన్ని దానాలు ఏ ఫలితాలను ఇవ్వవని పండితులు చెబుతున్నారు. 'చీపురు ...

By -  అంజి
Published on : 27 Dec 2025 8:49 AM IST

donation, result, donate silver or gold, Pious works

ఏ దానం చేస్తే ఏ ఫలితం?.. వెండి, బంగారం దానం చేస్తే?

పుణ్య కార్యాల్లో దానం అతి గొప్పది. అయితే కొన్ని దానాలు ఏ ఫలితాలను ఇవ్వవని పండితులు చెబుతున్నారు. 'చీపురు దానమివ్వకూడదు. మిగిలిన ఆహారాన్ని దానం చేస్తే వారి కడుపు నిండుతుంది. కానీ ఏ ఫలం మీకు దక్కదు. గ్రహ దోషాలు ఉన్నవారు నూనె, స్టీల్‌ పాత్రలను ఎవరికీ ఇవ్వకూడదు. పదునైన వస్తువులు దానం చేస్తే విభేదాలు రావొచ్చు' అంటున్నారు.

ఏ దానం చేస్తే ఏ ఫలితం?

బియ్యం - పాపాలు తొలుగుతాయి.

పండ్లు - బుద్ధి, సిద్ధి కలుగుతాయి.

పెరుగు - ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది.

నెయ్యి - రోగాలు పోతాయి, ఆరోగ్యంగా ఉంటారు.

పాలు - నిద్ర లేమి సమస్య ఉండదు.

తేనె - సంతానం కలుగుతుంది.

ఊసిరికాయలు - జ్ఞాపకశక్తి పెరుగుతుంది.

టెంకాయ - అనుకున్న కార్యం సిద్ధిస్తుంది.

దీపదానం - కంటి చూపు మెరుగుపడుతుంది.

వస్త్రదానం - ఆయుష్షు

అన్నదానం - ధనవృద్ధి పెరుగుతుంది.

వెండి, బంగారం దానం చేస్తే?

వెండి దానంతో చంద్రుని అనుగ్రహం లభించి మనశ్శాంతి కలుగుతుంది. బంగారం దానం చేస్తే జాతకంలోని దోషాలు తొలగి ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. గోదానంతో పితృదేవతల ఆశీస్సులు దక్కుతాయి. అలాగే సమస్త రుణాల నుంచి విముక్తి లభిస్తుంది. ఇక భూదానం చేస్తే బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుందని నమ్మకం. ఏదానమైనా ప్రతిఫలం ఆశించకుండా భక్తితో సమర్పించినప్పుడే మనకు పూర్తి పుణ్యం దక్కుతుంది. సాధ్యమైనంతో ఇతరులకు మేలు చేయడం శుభకరం.

దానాలు చేస్తే పుణ్యమెలా వస్తుంది?

దానం చేయడం వల్ల మనలోని అహంకారం తొలగి, సమాజం పట్ల బాధ్యత పెరుగుతుంది. ఇతరుల ఆకలిని, అవసరాన్ని తీర్చినప్పుడు కలిగే ఆనందం మనసుకి ప్రశాంతత ఇస్తుంది. స్వార్థం లేకుండా చేసే దానం వల్ల పూర్వజన్మ పాపాలు నశించి, గ్రహ దోషాలు తొలగిపోతాయి. ఇచ్చే గుణం అలవడటం వల్ల సానుకూల శక్తి పెరిగి, జీవితంలో సంతోషాలు సిద్ధిస్తాయి. దానం కేవలం వస్తువుల మార్పిడి కాదు, మనలోని దయాగుణాన్ని పెంచే ఆధ్యాత్మిక ప్రక్రియ.

Next Story