వరలక్ష్మీ వ్రతం..ఇలా చేస్తే అన్నీ శుభాలే
శ్రావణమాసంలో వచ్చే వరలక్ష్మీదేవి వ్రతముని ప్రతి మహిళలు అందరూ ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు.
By Knakam Karthik
వరలక్ష్మీ వ్రతం..ఇలా చేస్తే అన్నీ శుభాలే
హిందూ సంప్రదాయంలో శ్రావణమాసానికి ఓ ప్రత్యేకత ఉంటుంది. ఈ మాసంలో ఎక్కువగా పండుగల వాతావరణం కనిపిస్తుంది. ఆ మాసమంతా కూడా అందరూ ఆధ్యాత్మికతతో నిండి ఉంటారు. అయితే ప్రత్యేకంగా శ్రావణమాసంలో వచ్చే వరలక్ష్మీదేవి వ్రతముని ప్రతి మహిళలు అందరూ ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. లక్ష్మీదేవికి ప్రీతికరమైన శ్రావణమాసం నాడు లక్ష్మీదేవి పూజను ఈ విధంగా చేశారంటే మీకు లక్ష్మీదేవి కటాక్షం తప్పక కలుగుతుంది. లక్ష్మీదేవి పూజ ఎలా చేయాలో తెలుసుకుందాం. లక్ష్మీదేవి పూజ విధానంలో మొదట గృహమును శుభ్రపరచుకోవాలి, ద్వార లక్ష్మీ పూజ అంటే గడపను పూజించాలి. అమ్మవారికి అలంకరణ చేయాలి. వివిత దీపాల ప్రాముఖ్యత, వ్రతం విధానం గురించి తెలుసుకుందాం..
వరలక్ష్మీ వ్రతం రోజు లక్ష్మీదేవిని పూజించిన తర్వాత, ముత్తైదువులకు వాయనం ఇవ్వడం సంప్రదాయం. వ్రతం పూర్తయిన తర్వాత భక్తిశ్రద్ధలతో వాయనం ఇస్తే అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. వాయనంలో పెట్టే ప్రతి వస్తువుకూ ఒక ప్రత్యేకత ఉంది. పసుపు, కుంకుమ, గాజులు, జాకెట్ ముక్క, వక్కలు, తమలపాకులు, పసుపు కొమ్ములు, రూపాయి నాణెం, పువ్వులు, నానబెట్టిన శనగలు, పండ్లు లాంటివి వాయనంలో తప్పనిసరిగా ఉండాలి. ఈ వస్తువులు శుభాలను సూచిస్తాయి.
వాయనంలో కుళ్లిపోయిన పండ్లు, పాడైపోయిన వస్తువులు పెట్టకూడదు. ముత్తైదువులకు వాయనం ఇచ్చేటప్పుడు వారిని సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపంగా భావించి ఇవ్వాలి. వాయనం ఇచ్చేటప్పుడు మీ మనసు నిండుగా ఉండాలి. అప్పుడు మాత్రమే అమ్మవారి ఆశీస్సులు మీకు సంపూర్ణంగా లభిస్తాయి. వాయనం ఇస్తున్నప్పుడు మీ మనసులో ఎటువంటి చెడు ఆలోచనలు రాకుండా చూసుకోవాలి.
వాయనం ఇచ్చిన తర్వాత ముత్తైదువుల పాదాలకు నమస్కరించి వారి ఆశీర్వాదం తీసుకోవాలి. ఈ ఆశీర్వాదం మనకు అష్టైశ్వర్యాలను, సకల శుభాలను చేకూరుస్తుంది. వాయనం ఇచ్చేటప్పుడు ఆశీర్వాదం తీసుకోవడం వల్ల మీ జీవితంలో సంతోషం, శ్రేయస్సు పెరుగుతాయి.
వ్రతం నిర్వహణ విధానం
భక్తులు శుచిగా ఉండి, పవిత్రమైన బట్టలు ధరిస్తారు.
పూజ మందిరాన్ని పూలతో, రంగులతో అందంగా అలంకరించడం.
లక్ష్మీ దేవి ప్రతిష్ఠ కోసం కలశాన్ని తయారు చేయడం. కలశాన్ని ఆవుపాలతో, పసుపుతో, కుంకుమతో అలంకరించడం.
పూజ కోసం కావలసిన అన్ని పూజా సామగ్రిని సిద్ధం చేయడం.
లక్ష్మీ దేవిని పూజించడం, స్తోత్రాలు, అష్టోత్తర శతనామావళి చదవడం.
నైవేద్యంగా పాయసం, పులిహెూర, పాయసం వంటి ప్రసాదాలను సమర్పించడం.
వరలక్ష్మీ వ్రత కథ విన్నవడం.
లక్ష్మీ దేవికి హారతి ఇవ్వడం.
వ్రతం ప్రాముఖ్యత
వరలక్ష్మీ వ్రతం ద్వారా మహిళలు లక్ష్మీ దేవి అనుగ్రహం పొందగలరు.
ఈ వ్రతం సామాజికంగా మహిళల్ని ఒకచోట చేర్చుతుంది, అందరూ కలిసి పూజలు చేయడం, కథ వినడం, ప్రసాదం పంచుకోవడం వంటివి చేస్తారు.
కుటుంబ సభ్యులందరూ కలిసి ఈ వ్రతం నిర్వహించడం వల్ల కుటుంబ ఐక్యత పెంపొందుతుంది.