నేడే రథ సప్తమి.. సూర్యుడికి అర్ఘ్యం ఎలా సమర్పించాలి, సంతాన ప్రాప్తి కోసం ఏం చేయాలంటే?
నేడు మాఘ శుద్ధ సప్తమి. ఆరోగ్య కారకుడైన సూర్యుడు జన్మించిన రోజు. నేడు సూర్యోదయానికి ముందే నిద్రలేచి అరుణోదయ స్నానం చేస్తే...
By - అంజి |
నేడే రథ సప్తమి.. సూర్యుడికి అర్ఘ్యం ఎలా సమర్పించాలి, సంతాన ప్రాప్తి కోసం ఏం చేయాలంటే?
నేడు మాఘ శుద్ధ సప్తమి. ఆరోగ్య కారకుడైన సూర్యుడు జన్మించిన రోజు. నేడు సూర్యోదయానికి ముందే నిద్రలేచి అరుణోదయ స్నానం చేస్తే ఏడు జన్మల పాపాలు తొలగి సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. సూర్యుడికి అర్ఘ్యం సమర్పించి, సూర్య నమస్కారాలు చేయాలని సూచిస్తున్నారు. ఆదిత్య హృదయం పఠిస్తే ఆయురారోగ్యాలు వృద్ధి చెందుతాయని నమ్మకం.
రథ సప్తమి నాడు కొన్ని ముఖ్యమైన నియమాలను తప్పకుండా పాటించాలని పండితులు హెచ్చరిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో అభ్యంగ స్నానం చేయకూడదని అంటున్నారు. మాంసాహారం, మద్యపానాలకు దూరంగా ఉండాలంటున్నారు. జుట్టు, గోళ్లు కత్తిరించుకోవద్దని సూచిస్తున్నారు. ఈ నియమాలు అతిక్రమిస్తే దుష్పలితాలు కలుగుతాయని చెబుతున్నారు. శాస్త్ర ప్రకారం.. సూర్యుడికి ప్రీతికరమైన ఆదివారం, సప్తమి రోజుల్లోనూ ఈ నియమాలను పాటించాలట.
రథ సప్తమి నాడు అర్ఘ్యం ఎలా సమర్పించాలంటే?
సూర్యునికి అత్యంత ప్రీతిపాత్రమైనది అర్ఘ్యం. రథసప్తమి నాడు రాగి పాత్రలోని శుద్ధ జలంలో ఎర్రపూలు, రక్తచందనం, అక్షతలు కలిపి సూర్యునికి నమస్కరించాలి. శివపురాణంలోని మంత్రాన్ని పఠిస్తూ అర్ఘ్యం సమర్పించాలి. ఆవు పాల క్షీరాన్నాన్ని నైవేద్యంగా పెట్టాలి. దీని వల్ల సూర్యుడు ప్రసన్నం అవుతాడని నమ్మకం. ఇలా అర్ఘ్యం ప్రదానం చేస్తే ఆయురారోగ్యాలు, కంటి చూపు మెరుగుపడి విశేష తేజస్సు లభిస్తుందని శాస్త్రం చెబుతోంది.
సంతాన ప్రాప్తి కోసం..
సంతాన ప్రాప్తి కోరేవారు నేడు బియ్యప్పిండితో అష్టదళ పద్మం ముగ్గు వేయాలి. సూర్య నామాలు స్మరిస్తూ దాన్ని 7 రంగులతో నింపాలి. పద్మం మధ్యలో శివపార్వతులను ఉంచి, పక్కనే తెల్లని వస్త్రంపై సూర్యరథపు ప్రతిమను ఉంచి ఎర్రని పూలతో పూజించాలి. గోత్రనామాలతో సంకల్పం చెప్పుకోవాలి. దాన్ని బ్రహ్మణుడికి దానం ఇవ్వాలి. ఏడాది పాటు ప్రతి సప్తమికి ఉపవాసం ఉంటూ, సూర్యునికి అర్ఘ్యం సమర్పించాలి. తద్వారా ఫలితం ఉంటుంది.