Pushya Masam 2025: నేటి నుంచే పుష్యమాసం.. ఇలా చేయండి.

పుష్య మాసం పుణ్య మాసం. ఈ మాసంలో చంద్రుడు పుష్యమి నక్షత్రంతో కలిసి ఉంటాడు, అందుకే దీనికి పుష్య మాసం అని పేరు వచ్చింది.

By -  అంజి
Published on : 20 Dec 2025 7:52 AM IST

Pushya Masam 2025, Pushyami, Lord Shani,Spirituality

నేటి నుంచే పుష్యమాసం.. ఇలా చేయండి.

పుష్య మాసం పుణ్య మాసం. ఈ మాసంలో చంద్రుడు పుష్యమి నక్షత్రంతో కలిసి ఉంటాడు, అందుకే దీనికి పుష్య మాసం అని పేరు వచ్చింది. అటు శనిదేవుడిని జన్మనక్షత్రం కూడా పుష్యమే.. అందుకే ఈ మాసం శని దేవునికి ప్రీతికరమైనది. ఆయనను పూజిస్తే కష్ఠాలు తొలగి శుభాలు కలుగుతాయని నమ్మకం. విష్ణుమూర్తిని తులసీ దళాలతో పూజిస్తే సౌందర్యం, శివుడిని మారేడు దళాలతో అర్చిస్తే ఐశ్వర్యం లభిస్తాయని శాస్త్ర వచనం. ఈ నెలలో చేసే గింజంత దానమైనా అనంత పుణ్య ఫలాన్ని ఇస్తుందని అంటారు. నదీ స్నానాలు సూర్యారాధనతో ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని పండితుల వాక్కు.

పుష్యమాసం.. ఆధ్యాత్మికతకు, ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తుంది. ఈ మాసంలో చేసే పూజలు, దానధర్మాలు, జపాలు మంచి ఫలితాలను ఇస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. పుష్యమాసం శనితో సంబంధం కలిగి ఉంటుంది. ఇది ధనుర్మాసం తర్వాత వస్తుంది. ఈ మాసంలో ఉపనయనం వంటి శుభకార్యాలకు మంచి ముహూర్తాలు ఉంటాయి.

పుష్య మాసంలో ముఖ్యమైన రోజులు:

ప్రారంభం: డిసెంబర్ 20, 2025

ముగింపు: జనవరి 18, 2026

ముక్కోటి ఏకాదశి (వైకుంఠ ఏకాదశి): జనవరి 10, 2025

భోగి: జనవరి 13, 2025

మకర సంక్రాంతి: జనవరి 14, 2025

కనుమ: జనవరి 15, 2025

శనివారం రోజున ఇంట్లో సాంబ్రాణి వెలగించడం వల్ల వెలువడే సుగంధభరితమైన పొగ మానసిక ప్రశాంతతను ఇచ్చి, మనలోని సోమరితనాన్ని, ప్రతికూల ఆలోచనలను పారద్రోలుతుందని పండితులు చెబుతున్నారు. 'ఆధ్యాత్మికంగా చూస్తే.. ఈ ధూపం వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తులు నశించి ఈతిబాధలు తొలగిపోతాయి. అలాగే సకల దేవతల అనుగ్రహం లభించి, కుటుంబంలో సుఖశాంతులు చేకూరుతాయి. మనసు ఉల్లాసంగా మారి పనుల పట్ల ఉత్సాహం పెరుగుతుంది' అంటున్నారు.

Next Story