ఇంట్లో 'కూష్మాండ దీపం'ను వెలిగిస్తే అఖండ ఫలితాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు. దృష్టి, నర, శని దోషాలు తొలగిపోతాయని అంటున్నారు. ఈ దీపం వెలిగించడం వల్ల కాలభైరవుడి అనుగ్రహం లభిస్తుందట. చండీ హోమంతో సమానమైన ఫలితం దక్కుతుంది. ఆర్థిక, ఆరోగ్య, సంతాన సమస్యలను తొలగించుకోవడానికి ఈ పరిహారం పాటించాలి అని సూచిస్తున్నారు.
ఓ చిన్న బూడిద గుమ్మడి కాయ తీసుకోవాలి. దాన్ని అడ్డంగా కోయాలి. లోపల ఉండే గింజలన్నీ తీసి డొల్లగా చేయాలి. పసుపు, కుంకుమ పెట్టి అందులో నువ్వుల నూనె పోయాలి. 2 పెద్ద వత్తులతో దీపం వెలిగించాలి. అనంతరం పంచోపచార పూజ చేయాలి. కాల భైరవ అష్టకాన్ని 11 సార్లు చదవాలి. సాయంత్రం వరకు ఉపవాసం ఉండటం ఉత్తమం. ఘన పదార్థాలను తినకూడదు. ఉదయం 4.30 గంటల నుంచి ఉదయం 6.00 గంటల మధ్యలో ఈ పూజ చేస్తే ఉత్తమ ఫలితాలు ఉంటాయి.
19 అమావాస్యలు చేస్తే..
'కూష్మాండ దీపం'ను అమావాస్య/ అష్టమి రోజు వెలిగించాలి. మొత్తం 19 అమావాస్యలు లేదా 19 అష్టములు ఈ దీపం వెలిగించడం వల్ల ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. పూజానంతరం ఎండు ఖర్జురాన్ని నైవేద్యంగా పెట్టాలి. ఇలా చేస్తే గ్రహ వాస్తు పీడల నుంచి ఉపశమనం లభిస్తుందని నమ్మకం. జనాకర్షణ, ధనయోగం కోసం ఈ పరిహారాన్ని పాటిస్తారు. కోరిన కోర్కెలు నెరవేరాలని కాలా భైరవుడిని స్మరిస్తూ సంకల్పం చెప్పుకొని ఈ 'కూష్మాండ దీపం'ను వెలిగిస్తారు.