కర్మల ఫలితంగా శని దోషం.. నివారణకు పాటించాల్సిన పరిహారాలు ఇవే
జాతకంలో శని గ్రహం బలహీనంగా ఉంటే వారికి శని దోషం ఉన్నట్టు పరిగణిస్తారు. మన కర్మల ఫలితంగా ఈ దోషం ఏర్పడుతుందని జ్యోతిషులు చెబుతున్నారు.
By - అంజి |
కర్మల ఫలితంగా శని దోషం.. నివారణకు పాటించాల్సిన పరిహారాలు ఇవే
జాతకంలో శని గ్రహం బలహీనంగా ఉంటే వారికి శని దోషం ఉన్నట్టు పరిగణిస్తారు. మన కర్మల ఫలితంగా ఈ దోషం ఏర్పడుతుందని జ్యోతిషులు చెబుతున్నారు. ఈ దోషం ఉన్నవారికి జీవితంలో అనుకోని ఆలస్యాలు, కష్టాలు, సవాళ్లు, మానసిక ఆందోళనలు ఎదురవుతాయని అంటున్నారు. జన్మరాశిలో శని సంచారం ఆధారంగా ఏలినాటి, అర్ధాష్టమ, అష్టమ శని దోషాలు ఏర్పడతాయి.
శని దోషం ప్రభావం ఎక్కువ కాలం ఉంటుంది. అందుకే కొన్ని పరిహారాలు తప్పక పాటించాలని పండితులు సూచిస్తారు. ప్రతి శనివారం నువ్వుల నూనెతో దేవుడికి దీపం పెట్టాలి. పక్షులకు ఆహారం, నల్ల చీమలకు చక్కెర పెట్టాలి. పెరుగన్నం దానం చేయాలి. సోమవారం శివాలయాలను దర్శించాలి. పంచాక్షరీ మంత్రాన్ని జపించాలి. మంగళవారం హనుమాన్ చాలీసా పఠిస్తే ఫలితాలుంటాయి. దశరథ శని స్త్రోత్రంతో శని దోషం సన్నగిల్లుతుంది అంటున్నారు.
చేసే పనులకు అడ్డంకులు ఎదురైనా, ప్రతి విషయం ఆలస్యమైనా, ఎంత సంపాదించినా డబ్బు నిలవకపోయినా, మానసిక బాధ, నిరాశ వంటి లక్షణాలు శని దోషానికి సంకేతాలుగా భావించవచ్చు. అలాగే యవ్వనంలో జుట్టు రాలడం, కంటి చూపు మందగించడం, వైవాహిక జీవితంలో ప్రేమ, ఆప్యాయత లేకపోవడం, తరచూ గొడవలు వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. శని దోషం ఉన్నట్టు నిర్దారించుకోవడానికి మీ జన్మ తేదీ, సమయం ఆధారంగా జ్యోతిషుడిని సంప్రదించాలి.
జ్యోతిషం ప్రకారం.. శని గ్రహ సంచారాన్ని బట్టి ప్రధానంగా 3 దోషాలు ఉంటాయి. మొదటిది ఏలినాటి శని, జన్మరాశికి 12,1,2 స్థానాల్లో శని గ్రహం ఉండటం వల్ల ఏర్పడుతుంది. ఇది ఒక్కో స్థానానికి 2.5 ఏళ్ల చొప్పున మొత్తం ఏడున్నర ఏళ్ల పాటు ఉంటుంది. రెండోది అష్టమ శని. 8వ స్థానంలో 2.5 ఏళ్లు నష్టాలు, ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. మూడోది అర్ధాష్టమ శని. 4వస్థానంలో 2.5 ఏళ్లు కుటుంబ స్థిరాస్తి వివాదాలను సూచిస్తుంది.