మాఘమాసం పవిత్ర స్నానాలకు ప్రసిద్ధి. ఇక మాఘ పౌర్ణమి మరింత ప్రత్యేకం. ఈ రోజు దేవతలే భువిపైకి వచ్చి నదుల్లో స్నామాచరిస్తారని పురాణ గాథ. ఇంతటి పుణ్య దినాన భక్తులు నదీ స్నానం చేయాలని పండితులు సూచిస్తున్నారు. నువ్వులు, వస్త్రాలు, బియ్యం దానం చేస్తే జాతక పితృ దోషాలు తొలగి పాప విముక్తి, ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందని చెబుతున్నారు.
ఈ రోజున దేవతలు పవిత్ర నదుల్లో స్నానం చేస్తారని పురణాలు చెబుతున్నాయి. అందుకే ఇవాళ నదీ, సముద్ర స్నానాలు ఆచరించి, దాన ధర్మాలు చేయడం వల్ల జాతక, పితృ దోషాలు తొలగి పాప విముక్తి లభిస్తుందని పండితులు చెబుతున్నారు. ఒకవేళ నదీ స్నానం చేయలేని వారు ఇంటి దగ్గరే స్నానం ఆచరిస్తూ 'గంగ చ యమునే చైవ' అనే శ్లోకాన్ని పఠించాలి. మద్యం, మాంసానికి దూరంగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు.
పూజా విధానం
ఉదయాన్నే నిద్ర లేవాలి. స్నానం ఆచరించాక పూజా గదిని అలంకరించాలి. ఆవు నెయ్యితో దీపం వెలిగించి, విష్ణుమూర్తి విగ్రహానికి గంగాజలంతో అభిషేకించాలి. భక్తితో కొలవాలి. పూజలో తప్పకుండా తులసి దళాలను సమర్పించాలి. లేదంటే పూజ అసంపూర్ణమవుతుంది. పండ్లు, నైవేద్యాలు సమర్పించి చివరగా 'ఓం ఘృణి సూర్యాయ నమః' అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఇలా పూజిస్తే ఆయన అనుగ్రహంతో సకల శుభాలు, పుణ్య ఫలాలు చేకూరుతాయని శాస్త్ర వచనం.