ఇవాళ భీష్మాష్టమి..ఈ నామం స్మరిస్తే పుణ్యఫలాలు మీ సొంతం
ప్రతి సంవత్సరం రథ సప్తమి అనంతరం 'భీష్టాష్టమి' జరుపుంటారు.
By - Knakam Karthik |
ఇవాళ భీష్మాష్టమి..ఈ నామం స్మరిస్తే పుణ్యఫలాలు మీ సొంతం
ప్రతి సంవత్సరం రథ సప్తమి అనంతరం 'భీష్టాష్టమి' జరుపుంటారు. హిందూ ధర్మశాస్త్రం ప్రకారం మాఘ మాసం అత్యంత పవిత్రమైనది. ఈ రోజునే కురుక్షేత్రంలో భీష్మ పితామహుడు అంపశయ్యపై ఉండి ఉత్తరాయన పుణ్యకాలం వరకు వేచి చూసి మాఘ మాసం శుద్ధ అష్టమి నాడు తన శరీరాన్ని విడిచి పెట్టాడు. అందుకే భీష్మ పితామహుని నిర్యాణం పొందిన ఈ దినం భీష్మాష్టమిగా దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. ఈ రోజున దానధర్మాలతో పాటు తర్పణాలు విడిచి పెడతారు.
తర్పణం ఎవరు చేయాలి?
ఈ మాసంలో వచ్చే శుక్ల పక్ష అష్టమిని 'భీష్మాష్టమి'గా జరుపుకుంటారు. . సాధారణంగా పితృ తర్పణాలు తండ్రి లేని వారు మాత్రమే ఇస్తుంటారు, కానీ భీష్మాష్టమి రోజున తండ్రి బతికున్న వారు కూడా తర్పణాలు వదలొచ్చు. ప్రతి ఒక్కరు మూడు దోసిళ్ళ అర్ఘ్యం భీష్మ ప్రీతికి ఇవ్వవలసి వుంటుంది. భీష్ముడు ఆజన్మాంతం నైష్టిక బ్రహ్మచారిగా జీవించి కడపట మహావిష్ణు సన్నిధిలో అతనిని కన్నుల పండువుగా కాంక్షించుచు ముక్తిని పొందిన గొప్ప జీవి. ఈ ప్రక్రియను అందరు భీష్మ తర్పణం అని అంటారు. మాఘ శుద్ధ అష్టమి నాడు భీష్మ పితామహుడు అంపశయ్యపై నుంచి దేహత్యాగం చేసిన రోజుగా దీనిని భావిస్తారు.
ఈ పవిత్ర దినాన భీష్మునికి తర్పణాలు వదలడం, విష్ణు సహస్రనామ పారాయణ చేయడం వల్ల పితృ దోషాలు తొలగిపోతాయని నమ్మకం. మాఘ శుద్ధ అష్టమి(భీష్మాష్టమి) రోజునే భీష్ముడు మోక్షం పొందినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ పవిత్ర దినాన ఆయనకి తర్పణం సమర్పిస్తే ఉత్తమ సంతాన ప్రాప్తి కలుగుతుందని పండితులు చెబుతున్నారు. ‘తండ్రి బతికున్న వారు కూడా ఈ తర్పణం సమర్పించవచ్చు. తెలుపు దుస్తులతో విష్ణుమూర్తిని ఆరాధిస్తే పుణ్యఫలాలు లభిస్తాయి’ అని సూచిస్తున్నారు.