బోటు వెలికితీతకు మరోమారు ధర్మాడి సత్యం బృందం సన్నాహాలు
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 13 Oct 2019 4:44 PM ISTతూర్పుగోదావరి: దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద గోదావరి నదిలో మునిగిపోయిన బోటును వెలికితీసేందుకు మరో ప్రయత్నించనున్నట్లు జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి తెలిపారు. మరో సారి ధర్మాడి సత్యం బృందం బోటును వెలికి తీసేందుకు ప్రయత్నిస్తుందని చెప్పారు. వారం క్రితమే బోటును వెలికి తీసేందుకు ప్రయత్నించగా.. గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో తీవ్ర ఆటంకం ఏర్పడింది. ప్రస్తుతం గోవదావరిలో వరద ప్రవాహం నిలకడగా ఉంది. దీంతో బోటును వెలికితీసేందుకు చర్యలు చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా రేపు కచ్చులూరు దగ్గర బోట్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టనున్నట్లు కలెక్టర్ మురళీధర్ రెడ్డి తెలిపారు.
Next Story