సీబీఐ చిటికెస్తే జగన్‌ పరిస్థితి ఏం అవుతుందో..?!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  17 Nov 2019 3:57 PM IST
సీబీఐ చిటికెస్తే జగన్‌ పరిస్థితి ఏం అవుతుందో..?!

ముఖ్యాంశాలు

  • సీఎం జగన్‌, వైసీపీ నేతలపై దేవినేని ఉమా ఫైర్‌
  • మంత్రులు ఇష్టం వచ్చినట్టు దుర్బాషలాడుతున్నారు: ఉమా
  • టీడీపీ నేతలు గురించి అసభ్యకరంగా మాట్లాడితే ఊరుకోం: కొల్లు రవీంద్ర

విజయవాడ: సీఎం జగన్‌, వైసీపీ నేతలపై మాజీ మంత్రి దేవినేని ఉమా తీవ్ర స్థాయిలో ఫైర్‌ అయ్యారు. సన్న బియ్యం గురించి మేము అడిగితే మమ్మల్ని వెకిలి చేష్టలు అంటారా అంటూ మండిపడ్డారు. జగన్‌ అభద్రతా భావంలో ఉన్నారని.. 151 సీట్లు ఎవరి పుణ్యానో వచ్చాయని దేవినేని ఉమా పేర్కొన్నారు. మంత్రులు ఇష్టం వచ్చినట్టు దుర్బాషలాడుతున్నారని మండిపడ్డారు. మంత్రులు నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. జగన్‌ చిటికేస్తే టీడీపీ పరిస్థితి కాదు.. సీబీఐ చిటికెస్తే జగన్‌ పరిస్థితి ఏం అవుతుందో చూడాలన్నారు. వైసీపీ ఎంపీలు వేరే దుకాణం పెడుతున్నారని.. ముందు మీ పార్టీ సంగతి చూసుకోవాలన్నారు. చంద్రబాబు ఇంటికి వెళ్లేవారి పేర్లు, ఫోన్‌ నెంబర్లు చెప్పాలా.. అంటూ దుయ్యబట్టారు. తమ మీద నిఘా ఎందుకు పెడుతున్నారని దేవినేని ప్రశ్నించారు.

కొడాలి నానిపై దేవినేని ఉమా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల శ్రీవారి గురించి కొడాలి నాని భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడరన్నారు. మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ పత్రికలు కూడా రాయలేని విశంగా నీచమైన భాష మాట్లాడరని దేవినేని ఆరోపించారు. కేసులకు, విమర్శలకు భయపడమన్నారు. నాటి ముఖ్యమంత్రి చంద్రబాబుపై జగన్‌ కాల్చేయాలని అనలేదా అని దేవినేని ఉమా సూటిగా ప్రశ్నించారు. రివర్స్‌ టెండరింగ్‌తో నిధుల ఆదా అని సొంత డబ్బా కొట్టుకున్నారని ఎద్దేవా చేశారు. రివర్స్‌ టెండరింగ్‌లో రూ.7,500 కోట్లు నష్టం వచ్చింది. 22 మంది ఎంపీలు ఉన్నా రాష్ట్రానికి నిధులు తీసుకురాని అసమర్థత వైసీపీ ప్రభుత్వానిదని దేవినేని ఉమా విమర్శించారు.

మంత్రులు నీచంగా మాట్లాడుతున్నారని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. టీడీపీ నేతలు గురించి అసభ్యకరంగా మాట్లాడితే ఊరుకోమన్నారు. చంద్రబాబు గురించి మాట్లాడే అర్హత మీకు ఉందా? అంటూ కొల్లు రవీంద్ర ప్రశ్నించారు. అడ్రస్‌ లేని వ్యక్తులు, అమ్ముడు పోయిన వ్యక్తుల చేత మాట్లాడిస్తారా అంటూ మండిపడ్డారు. కొడాలి నాని, వంశీకి రాజకీయ భిక్ష పెట్టింది టీడీపే అని పేర్కొన్నారు. లోకేష్‌ తెలివితేటలు, పరిపాలన దక్షత గురించి మీకు తెలుసా?. అంటూ విరుచుకుపడ్డారు. లోకేష్‌ అనేక ఐటీ కంపెనీలు రాష్ట్రానికి తీసుకొచ్చారని కొల్లు రవీంద్ర తెలిపారు. ఇంకోసారి లోకేష్‌ గురించి మాట్లాడితే చట్టపరమైన చర్యలు తీసుకునేలా పోరాటం చేస్తామన్నారు.

Next Story