రేపు మ‌ధ్యాహ్నం బేగంపేట నుంచి ప్ర‌త్యేక విమానంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్ల‌నున్నారు. ఎల్లుండి ఉద‌యం 11.30 గంట‌ల‌కు ప్ర‌ధాని మోదీతో సీఎం కేసీఆర్ భేటీ కానున్నారు. ఈ నేప‌థ్యంలో రాష్ట్రానికి సంబంధించిన ప‌లు అంశాల‌పై మోదీతో కేసీఆర్ చ‌ర్చించ‌నున్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన గ్రాంట్స్, కృష్ణా గోదావ‌రి న‌దుల అనుసంధానం ప్రాజెక్టు, పెండింగ్ లో ఉన్న విభ‌జ‌న స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించ‌నున్నారు. బ‌య్యారం ఉక్కు క‌ర్మాగారం, కాళేశ్వ‌రం ప్రాజెక్టుకు జాతీయ హోదా, జోన‌ల్ స‌వ‌ర‌ణ, పెండింగ్ లో ఉన్న రిజ‌ర్వేష‌న్లు త‌దిత‌ర‌ అంశాల‌పై ప్ర‌ధాని మోదీతో కేసీఆర్ చ‌ర్చించ‌నున్నారు. లోక్ స‌భ ఎన్నిక‌లు జ‌రిగిన త‌ర్వాత మొద‌టిసారిగా ప్ర‌ధాని మోదీతో కేసీఆర్ స‌మావేశం కాబోతున్నారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.