ఢిల్లీలో రెచ్చిపోయిన పోలీసులు, న్యాయవాదులు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  3 Nov 2019 5:22 AM GMT
ఢిల్లీలో రెచ్చిపోయిన పోలీసులు, న్యాయవాదులు

వాహనాల పార్కింగ్ విషయంలో చెలరేగిన వివాదం

ఘటనను ఖండించిన బార్ అసోసియేషన్లు

ఢిల్లీ: దేశ శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసులు, న్యాయాన్ని ధర్మాన్ని నిలబెట్టాల్సిన లాయర్లు విచక్షణ కోల్పోయారు. వాహనాల పార్కింగ్ విషయంలో చెలరేగిన వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది. ఇరువర్గాలు సంయమనం కోల్పోవడంతో ఘర్షణ జరిగి పది మంది పోలీసులు, పలువురు లాయర్లు గాయపడ్డారు. సుమారు 20 వాహనాలు ధ్వంసమయ్యాయి. ఇదంతా ఢిల్లీలోని తీస్ హజారే కోర్టు ప్రాంగణంలో జరిగింది. కోర్టు ఆవరణలో ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. వివాదం ముదిరి పలు వాహనాలకు నిప్పు పెట్టె స్థాయి వరకు వెళ్లడంతో ఒక పోలీసు వ్యాన్ పూర్తిగా దగ్ధమైంది.

Img 20191103 100450

పార్టీ విషయంలో పోలీసులకు న్యాయవాదికి మధ్య ఘర్షణ చెలరేగడంతో న్యాయవాదికి చెందిన కారును పోలీసులు ఢీ కొట్టించారని, న్యాయవాది మీద కూడా దాడికి దిగడంతో పోలీసులు నాలుగు రౌండ్లు కాల్పులు చేశారని న్యాయవాదులు చెబుతున్నారు. దీంతో పలువురు లాయర్లకు గాయాలయ్యాయి. అనంతరం కొంతమంది పోలీసు వాహనాలకు నిప్పంటించగా ఇతర వాహనాలు సైతం ధ్వంసమయ్యాయి. రంగంలోకి దిగిన ఫైరింజన్లు మంటలను అదుపులోకి తెచ్చాయి. ఘటనను ఖండించిన బార్ అసోసియేషన్లు ఈనెల 4వ తేదీన అన్ని జిల్లా కోర్టులో సమ్మె నిర్వహించాలని పిలుపునిచ్చాయి. న్యాయవాదులకు మద్దతుగా ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ సోమవారం నుంచి విధులను నిలిపివేస్తున్నట్లు గా ప్రకటించింది. దాడి చేసిన పోలీసులు మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందిగా డిమాండ్ చేస్తోంది.

Img 20191103 100448

Next Story