మాకు సమోసాలు, పిజ్జాలు కావాలి.. దేశ రాజధానిలో వింత కోరికలు

By రాణి  Published on  19 April 2020 5:03 PM GMT
మాకు సమోసాలు, పిజ్జాలు కావాలి.. దేశ రాజధానిలో వింత కోరికలు

భారత్ లో రోజురోజుకూ కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతోంది. దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పటి వరకూ 1800 కరోనా కేసులు నమోదవ్వగా 43 మంది మృతి చెందారు. ఒకే కుటుంబానికి చెందిన 31 మందికి, పిజ్జా డెలివరీ బాయ్ కి కరోనా సోకడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. అంతకు ముందు కేంద్రం ప్రకటించిన కంటైన్మెంట్ జోన్లు కాకుండా ప్రభుత్వం మరిన్ని ఏరియాలను కంటైన్మెంట్ ఏరియాలుగా ప్రకటించింది. మొత్తం 76 కంటైన్మెంట్ జోన్లలో ప్రజలు బయటికి రాకుండా పోలీసులను కాపలా పెట్టింది. ఎవరికి ఏ నిత్యావసరాలు కావాలన్నా పోలీసులే అందజేసేలా చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో స్థానికులు అడుగుతున్న తినుపదార్థాలను విన్న పోలీసులు అవాక్కవుతున్నారు. ప్రజల నుంచి తమకు విచిత్రమైన డిమాండ్లు వస్తున్నాయని అధికారులకు చెప్పారు.

Also Read : ర్యాపిడ్ టెస్ట్ కిట్లపై రాజకీయ రభస

ఢిల్లీ శివారులో గల నరేలా ప్రాంతంలో కొంత మంది తమకు బిర్యానీ, మటన్ కావాలని అడిగినట్లు అధికారి వెల్లడించారు. అలాగే దక్షిణ ఢిల్లీలో ఉన్న 9 కంటైన్మెంట్ ప్రాంతాల్లోనివారు సమోసాలు, పిజ్జాలు అడుగగా..మరికొన్ని కంటైన్మెంట్ జోన్లలో మిఠాయిలు కావాలని అడిగినట్లు పేర్కొన్నారు. ఈ విషయాలన్నీ తెలిసిన పై అధికారులు ప్రజలు అడిగిన కోర్కెలన్నింటినీ తాము తీర్చమని తేల్చేశారు. నిత్యావసరాలైన పాలు, కూరగాయలు, నీరు ప్రజలకు అందించడం తమ కర్తవ్యం కాబట్టి అవి మాత్రమే అందజేస్తామన్నారు. పోలీసులు వృత్తి ధర్మాన్ని వీడక ప్రజల కోసం పనిచేస్తుంటే..ఇళ్లలో ఉండలేని వారు ఇలా గొంతెమ్మ కోరికలు కోరుతున్నారంటూ విమర్శలొస్తున్నాయ్

Also Read :రక్తదానం చేయమంటున్న చిరంజీవి

Next Story