ర్యాపిడ్ టెస్ట్ కిట్లపై రాజకీయ రభస

By రాణి  Published on  19 April 2020 3:03 PM GMT
ర్యాపిడ్ టెస్ట్ కిట్లపై రాజకీయ రభస

  • పచ్చమాఫియా ఏడుపు మొదలైందన్న విజయసాయిరెడ్డి

రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో..కరోనా వైద్య పరీక్షలను వేగంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం దక్షిణ కొరియా నుంచి కోవిడ్ 19 ర్యాపిడ్ టెస్ట్ కిట్లను తెప్పించింది. ఆ కిట్ తోనే సీఎం వైఎస్ జగన్ కు పరీక్షలు చేయగా 10 నిమిషాల్లోనే రిజల్ట్ వచ్చింది. ఈ విషయంపై ప్రతిపక్ష నేతలు ఆరోపణలు చేయగా..వాటిని తిప్పి కొట్టేలా విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

Also Read : రక్తదానం చేయమంటున్న చిరంజీవి

'' శవాల మీద పేలాలు ఏరుకునే పచ్చ మాఫియా ర్యాపిడ్ టెస్ట్ కిట్లపైన ఏడుపు మొదలు పెట్టింది. ఛత్తీస్ గడ్ రూ. 337 కు కొంటే మీరు 700 దాకా ఎలా పెడతారని. అవి దేశంలోనే తయరైనవి. రిజల్ట్ కు 30 ని. పడుతుంది. సిఎం జగన్ గారు కొరియా నుంచి తెప్పించినవి 10 ని.ల్లోనే కచ్చితమైన ఫలితాలు చూపుతాయి.''Next Story
Share it