మెగాస్టార్ చిరంజీవి మీరూ రక్తదానం చేయండంటూ ఫ్యాన్స్ ను ట్విట్టర్ వేదికగా కోరారు. ఆదివారం మెగాస్టార్ తో పాటు హీరో శ్రీకాంత్, కొడుకు రోషన్ లు కూడారక్తదానం చేశారు. ఈ సందర్భంగా ట్వీట్ చేసిన చిరంజీవి కరోనా కష్టకాలంలో మిగతా రోగుల కోసం రక్తదానం చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మీకు దగ్గర్లో ఉన్న బ్లడ్ బ్యాంక్ లో రక్తదానం చేయండి లేదా..ఏదైనా బ్లడ్ బ్యాంక్ కు కాల్ చేస్తే ఏ సమయంలో రక్తదానమివ్వాలో వారు సూచనలు చేస్తారని పేర్కొన్నారు చిరంజీవి.

కరోనా రోగులకు చికిత్స అందించడం లో నిమగ్నమైన ప్రభుత్వం తలసేమియా రోగులకు చికిత్స చేయడంపై కూడా దృష్టి పెట్టింది. కరోనా కష్టకాలంలో సైతం తలసేమియా, క్యాన్సర్ రోగులకు చికిత్స అందించేందుకు రక్తదానం చేయాల్సిందిగా మంత్రి ఈటెల రాజేందర్ కూడా ఇటీవల కోరారు. కొన్నిచోట్ల రెడ్ క్రాస్ సంస్థ ద్వారా కూడా రక్తదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి.

Also Read :స్విట్జర్లాండ్ కు థ్యాంక్స్ చెప్పిన అల్లు అర్జున్

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.