స్విస్ ఆల్ప్స్ లోని మాటర్ హార్న్ పర్వతంపై స్విస్ లైట్ ఆర్టిస్ట్ జెర్రీ హాప్స్ భారత జాతీయ జెండాను ఆవిష్కరించిన సంగతి విధితమే. దీనిపై స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స్పందించారు. మాటర్ హార్న్ పర్వతాన్ని ఇలా త్రివర్ణ పతాక రంగుల్లో చూస్తానని తానెప్పుడూ అనుకోలేదంటూ ట్వీట్ చేశారు బన్నీ. భారత్ కరోనా మహమ్మారిపై చేస్తున్న అలుపెరుగని పోరాటానికి సంఘీభావం తెలిపిన స్విట్జర్లాండ్ కు థ్యాంక్స్ చెప్పారు. భారత్ కు మీరు సంఘీభావం ప్రకటించిన తీరు నా మనసుకు ఎంతగానో హత్తుకుంది అని ఆ ట్వీట్ లో రాశారు.

Also Read : ఆన్ లైన్ విక్రయాలకు మళ్లీ బ్రేక్ వేసిన కేంద్రం

అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో రాయలసీమ బ్యాక్ గ్రౌండ్ లో ఓ చిత్రం తెరకెక్కుతోంది. లాక్ డౌన్ కారణంగా చిత్రం షూటింగ్ నిలిచిపోయింది. ఇటీవల అల్లుఅర్జున్ బర్త్ డే సర్ ప్రైజ్ గా చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ ను ఆవిష్కరించారు. చిత్రం పేరు పుష్ప కాగా..పక్కా సీమ మాస్ లుక్ లో కనిపించారు. చిత్తూరు యాసలోనే అల్లు అర్జున్ భాష ఉంటుందన్న క్లారిటీ కూడా ఇచ్చేసింది. అలాగే బన్నీ సరసన నటిస్తోన్న రష్మిక మండన్న కూడా లాక్ డౌన్ లో చిత్తూరు యాస నేర్చుకుంటున్నట్లు తెలిసింది.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.