దేశ రాజధాని ఢిల్లీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పోలీసులకు, దుండగులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు దుండగులు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రహ్లదపుర ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్‌ జరిగింది. గత కొంతకాలంగా పలు కేసుల్లో నిందితులుగా ఉన్న ఇద్దరు రాజా ఖురేషీ, రమేష్‌ బహదూర్‌లు.. పుల్‌ ప్రహ్లదపురలో తలదాచుకుంటున్నారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. పోలీసుల రాకను గుర్తించిన నిందితులు.. వారిపై కాల్పులకు తెగబడ్డారు. ఆ తర్వాత పోలీసులు కూడా ఎదురు కాల్పులు చేశారు.

Delhi Encounter News

పోలీసుల కాల్పుల్లో.. ఇద్దరు నిందితులు చనిపోయారు. సోమవారం ఉదయం 5.30 గంటల సమయంలో జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో పోలీసులు, నిందితులకు మధ్య 30 రౌండ్లు కాల్పులు జరిగాయి. ఇద్దరు నిందితులు పలు దొంగతనాల కేసుల్లో, హత్య కేసుల్లో నిందితులుగా ఉన్నారని ఢిల్లీ పోలీసులు తెలిపారు. తాజాగా జరిగిన కారావాల్‌నగర్‌ హత్య కేసులో కూడా వీరి హస్తం ఉందని పోలీసులు నిర్దారించారు.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.