ఢిల్లీ ఎన్నికల షెడ్యూల్‌.. పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా కూడా..

By అంజి  Published on  6 Jan 2020 1:32 PM GMT
ఢిల్లీ ఎన్నికల షెడ్యూల్‌.. పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా కూడా..

ఢిల్లీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. ఫిబ్రవరి 8న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 11న ఎన్నికల ఫలితాలు వెల్లడిస్తామని ఈసీ తెలిపారు. జనవరి 14 నుంచి రిటర్నింగ్‌ అధికారులు నామినేషన్ల స్వీకరించనున్నారు. నామినేషన్ల తుదిగడువు జనవరి 21 కాగా నామినేషన్ల ఉపసంహరణ గడువు జనవరి 24 వరకు ఇచ్చారు. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ రోజు నుంచే ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చింది. ఢిల్లీలో మొత్తం 1.46 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఎన్నికల కోసం 13,767 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.

90 వేల మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొననున్నారు. జనవరి 14 నోటిఫికేషన్‌ వెల్లడిస్తామని కేంద్ర ఎన్నికల అధికారి సునీల్‌ ఆరోరా తెలిపారు. వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా బ్యాలెట్‌ పద్దతిని ఏర్పాటు చేస్తామని, ఇంటి దగ్గరి నుంచే ఓటు వేయవచ్చని ఈసీ పేర్కొన్నారు. 2015లో జరిగిన ఎన్నికల్లో ఆమ్‌ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించింది. లోక్‌సభ ఎన్నికల తర్వాత మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్‌ రాష్ట్రాలకు ఎన్నికలు జరిగాయి. కాగా ఢిల్లీ శాసనసభ పదవీకాలం ముగుస్తుండడంతో ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించారు.

Next Story