నిర్భయ దోషులకు రేపే ఉరి ?
By రాణి Published on 19 March 2020 4:13 PM ISTముఖ్యాంశాలు
- కోర్టు ఎదుట అక్షయ్ భార్య గగ్గోలు
- ఆనందం వ్యక్తం చేసిన నిర్భయ తల్లిదండ్రులు
నిర్భయ పై సామూహిక అత్యాచారం చేసి, ఆమె మరణానికి కారణమైన నలుగురు దోషులు వినయ్, అక్షయ్, ముఖేష్, పవన్ లకు రేపు ఉదయం 5.30 గంటలకు ఉరిశిక్ష యథాతథంగా అమలవుతుందని వెల్లడించింది ఢిల్లీ పటియాలా కోర్టు. ఈ నెల 5వ తేదీన ఢిల్లీ పటియాలా కోర్టు జారీ చేసిన డెత్ వారెంట్లపై స్టే విధించాలని..తమకు మరొసారి క్షమాభిక్ష పిటిషన్లు పెట్టుకునేందుకు అవకాశం కల్పించాలని కోరుతూ నలుగురు నిందితులు వేసిన పిటిషన్ ను న్యాయస్థానం కొట్టివేసింది. డెత్ వారెంట్లపై స్టే విధించేందుకు కోర్టు అభ్యంతరం తెలిపింది. ఈ నేపథ్యంలో రేపు ఉదయమే నిందితులకు ఉరి తప్పనిసరి అని తేలింది. దోషులకు ఉన్న అన్ని న్యాయపరమైన అవకాశాలు వాడుకోవడంతో ఈసారి ఉరిశిక్ష వాయిదా పడే అవకాశాలు తక్కువే.
Also Read : కరీంనగర్‌లో ఇండోనేషియా బృందం.. ఎక్కడెక్కడ తిరిగారంటే.?
కానీ..దోషుల్లో ఎవరైనా తమకు ఆరోగ్యం బాగాలేదని హై డ్రామా చేస్తే తప్ప ఉరి వాయిదా పడే అవకాశం లేదు. మరోవైపు పటియాలా కోర్టు ఎదుట అక్షయ్ భార్య తన భర్తను విడిచిపెట్టాలంటూ మొరపెట్టుకుంది. చెప్పుతో కొట్టుకుంటూ లబోదిబోమని గగ్గోలు పెట్టింది. అక్కడున్న మహిళా న్యాయవాదులు ఆమెను సముదాయించారు. కొద్దిసేపటికే ఆ మహిళ స్పృహ తప్పి పడిపోయింది. ఇప్పటి వరకూ నిందితుల ఉరిశిక్ష మూడు సార్లు వాయిదా పడింది. ఈసారి కూడా ఉరిశిక్ష వాయిదా పడుతుందా ? లేదా అన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఉరిశిక్ష తప్పనిసరి అని కోర్టు స్పష్టం చేసినప్పటికీ..ఉరి అమలు చేయడానికి ఒక్క గంట ముందు కూడా ఉరి అమలు ఆగిపోయే ప్రమాదముంది.
Also Read : కరీంనగర్‌లో 144 సెక్షన్