ముఖ్యాంశాలు

  • మోదీపై వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు
  • కోర్టుకు హాజ‌రుకానందుకే అరెస్ట్ వారెంట్

కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, ఎంపీ శశిథరూర్‌పై ఢిల్లీ కోర్టు అరెస్టు వారెంట్‌ విడుదల చేసింది. కొద్దిరోజుల క్రితం మోదీని శివలింగంపై కూర్చున్న తేలుతో పోల్చుతూ ఆయన చేసిన వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌ల‌పై పరువునష్టం కేసు న‌మోదైన విష‌యం విదిత‌మే. అయితే ఆ కేసు విచారణలో భాగంగా కోర్టులో హాజరుకానందుకు గానూ శ‌శిథరూర్‌పై కోర్టు వారెంట్‌ను విడుదల చేసింది.

అయితే.. అక్టోబరు 8వ తేదీన బెంగుళూరులో జరిగిన లిటరేచర్ ఫెస్టివల్‌లో శ‌శిథరూర్ ప్రసంగిస్తూ.. నరేంద్ర మోదీ శివలింగంపై కూర్చున్న తేలు వంటివాడని, ఆ తేలును చేత్తో తీయలేమని, అలాగే చెప్పుతోనూ కొట్టలేమని విమర్శించారు. థ‌రూర్ వ్యాఖ్య‌ల‌పై అప్ప‌ట్లో పెద్ద దుమారం రేగింది. ప‌రువున‌ష్టం దావా న‌మోదైన ద‌రిమిలా ఇప్పుడు ఈ వారెంట్ ను విడుదల చేశారు.

సామ్రాట్ మేడి

మేడి. సామ్రాట్ .. నేను న్యూస్ మీట‌ర్ లో జ‌ర్న‌లిస్టుగా ప‌నిచేస్తున్నాను. గ‌తంలో ఆంధ్ర‌ప్ర‌భ‌, భార‌త్ టుడే, న్యూస్ హ‌బ్, ఏపీ హెరాల్డ్ ల‌లో 3 సంవ‌త్స‌రాల పాటు ప‌నిచేశాను. జ‌ర్న‌లిజం ప‌ట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.