టీకాలతో హెచ్ఐవీ కి చెక్

లెనాకావిర్ అనే కొత్త యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్తో సంవత్సరానికి రెండుసార్లు టీకాలు వేయడం ద్వారా హెచ్ఐవీ ఇన్ఫెక్షన్ను నివారించవచ్చని తేలింది.

By Kalasani Durgapraveen  Published on  2 Dec 2024 12:29 PM IST
టీకాలతో హెచ్ఐవీ కి చెక్

లెనాకావిర్ అనే కొత్త యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్తో సంవత్సరానికి రెండుసార్లు టీకాలువేయడం ద్వారా హెచ్ఐవీ ఇన్ఫెక్షన్ను నివారించవచ్చని తేలింది. దక్షిణాఫ్రికాలో నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్ లో శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని తెలిపారు .

‘లెనాకావిర్' అనే కొత్త యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్తో సంవత్సరానికి రెండుసార్లు టీకాలు వేయడం ద్వారా హెచ్ఐవీ ఇన్ఫెక్షన్ను నివారించవచ్చని తేలింది. దక్షిణాఫ్రికాలో నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్ లో శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని ధ్రువీకరించారు. మహిళల్లో చేసిన పరీక్షల్లో వందశాతం ప్రభావవంతంగా ఉందని తెలిపారు. పురుషుల్లో హెచ్ ఐ వీ సంక్రమణను దాదాపు తొలగిస్తుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

దాదాపు ఐదువేల మందిపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించారు. ఈ సమయంలో వ్యాక్సిన్ తీసుకున్న మహిళలు ఎవరూ ఇన్ఫెక్షన్ బారినపడలేదు. టీకాను ఆరునెలల వ్యవధిలో ఏడాదికి రెండు టీకాలు ఇస్తారు. హెచ్ఐవీతో బాధపడుతున్న 120 పేద దేశాల్లో లెనాకాపవిర్ను తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకువస్తామని డ్రగ్ తయారీ కంపెనీ గిలియడ్ తెలిపింది.

Next Story