బుధవారం డీఆర్డీవో (డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్) చేపట్టిన పినాక రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. దేశ రక్షణలో భాగంగా డీఆర్డీవో ఎప్పటికప్పుడు కొత్త ఆయుధాలను తయారు చేస్తోంది. ఇందులో భాగంగానే పినాక రాకెట్ పరిధిని డీఆర్డీవో పెంచింది. రాజస్థాన్‌లోని పోఖ్రాన్ ఫైరింగ్ రేంజ్‌లో రాకెట్‌ను శాస్త్రవేత్తలు విజయవంతంగా పరీక్షించారు. డీఆర్డీవో అధికారి మాట్లాడుతూ.. ''ఈ రాకెట్‌ను అభివృద్ధి చేశాం. అయితే ఉత్పత్తిని ప్రైవేట్ రంగ సంస్థ చేస్తోంది. రాకెట్ల ప్రయోగాలు పోఖ్రాన్‌లో కొనసాగుతున్నాయి. అనేక రాకెట్ల ట్రయల్స్ నిర్వహించగా ఈ పరీక్ష విజయవంతమైంది.'' అని చెప్పారు. పినాక ఆర్టిలరీ మిస్సైల్ సిస్టమ్.. ఇది శత్రు భూభాగంలోకి 75 కిలోమీటర్ల వరకు దూసుకువెళ్లి ఖచ్చితత్వంతో దాడి చేయగలదు.