ఈ త‌ప్పులు చేస్తే కారులో ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నా మిమ్మల్ని రక్షించలేవు..!

మునుపటితో పోలిస్తే దేశంలోని ప్రజలు ఇప్పుడు భద్రతా ఫీచర్లతో కూడిన కార్లను కొనుగోలు చేయడానికి ఇష్టపడుతున్నారు.

By Kalasani Durgapraveen  Published on  15 Nov 2024 5:49 AM GMT
ఈ త‌ప్పులు చేస్తే కారులో ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నా మిమ్మల్ని రక్షించలేవు..!

మునుపటితో పోలిస్తే దేశంలోని ప్రజలు ఇప్పుడు భద్రతా ఫీచర్లతో కూడిన కార్లను కొనుగోలు చేయడానికి ఇష్టపడుతున్నారు. దీని కారణంగా కంపెనీలు అనేక అధునాతన ఫీచర్లతో కూడిన వాహనాలను తీసుకువస్తున్నాయి. ఇక ఇప్పుడు ప్రతి కారులో 6-ఎయిర్‌బ్యాగ్‌లు తప్పనిసరి చేయబడ్డాయి. ఇవి ప్రమాద సమయంలో ప్రయాణీకులకు భద్రతను అందిస్తుంది. అయినప్పటికీ.. ప్రయాణికులు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. కొన్ని తప్పుల కారణంగా డ‌ అమర్చిన ఎయిర్‌బ్యాగ్‌లు కూడా మిమ్మల్ని రక్షించలేవు. ఈ తప్పుల గురించి తెలుసుకుందాం.

సీటు బెల్ట్ తప్పనిసరి..

వాహనంలో ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నా.. లేకపోయినా సీటు బెల్టులు తప్పనిసరిగా ధరించాలి. అయితే ఎయిర్ బ్యాగ్స్ ఉన్న వాహనంలో సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం ప్రమాదకరం. ఇటీవలి వాహనాలన్నింటిలో మీరు సీట్ బెల్ట్ ధరించకపోతే ఎయిర్‌బ్యాగ్‌లు తెరుచుకోని ఫీచర్‌ని పొందుప‌రిచారు. ఈ కారణంగా సీటు బెల్ట్ ధరించడం మర్చిపోవద్దు.

స్టీరింగ్ వీల్‌కి దూరంగా కూర్చోండి..

డ్రైవర్ సైడ్ ఎయిర్‌బ్యాగ్ స్టీరింగ్ వీల్‌లో అమర్చబడి ఉంటుంది. ఈ కారణంగా స్టీరింగ్‌కు చాలా దగ్గరగా కూర్చోకూడదు.. ఎందుకంటే ఎయిర్‌బ్యాగ్ తెరుచుకుంటే డ్రైవర్ ముఖం గాయపడవచ్చు. స్టీరింగ్ వీల్‌కు చాలా దగ్గరగా కూర్చుంటే ఎయిర్‌బ్యాగ్ సరిగ్గా తెరుచుకోదు.. దీని కారణంగా డ్రైవర్‌కు పూర్తి రక్షణ లభించదు.

డ్యాష్‌బోర్డ్‌కు అలంకారాలొద్దు..

ఇటీవల వస్తున్న అన్ని వాహనాలలో 6-ఎయిర్‌బ్యాగ్‌లు ఉంటున్నాయి. ఇప్పుడు కారులో కో-డ్రైవర్ కోసం కూడా ఎయిర్‌బ్యాగ్ ఉంటుంది. ఎయిర్‌బ్యాగ్ డాష్‌బోర్డ్ లోప‌లి నుంచి ఉంటుంది. కారు డ్యాష్‌బోర్డ్‌లో ఏదైనా వస్తువు ఉంచినట్లయితే.. ఆ వ‌స్తువు సహ-డ్రైవర్‌కు గాయం కావచ్చు.

సీట్ కవర్ విష‌యంలో జాగ్ర‌త్త‌..

కొన్ని వాహనాలకు సైడ్ ఎయిర్‌బ్యాగ్‌లు కూడా ఉంటాయి. ఇలాంటి వాహనాల్లో మరింత జాగ్రత్త అవసరం. చాలా కార్లలో సైడ్ ఎయిర్‌బ్యాగ్‌లు సీటు లోపల అమర్చబడి ఉంటాయి. సీటు కవర్లు క‌ప్పేసి ఉండ‌టం వ‌ల‌న‌ అవి తెరుచుకోవు. దీని కారణంగా ప్రయాణీకుడు గాయపడవచ్చు. దీన్ని దృష్టిలో ఉంచుకుని.. కొత్త సీట్ కవర్‌ను ఇన్‌స్టాల్ చేసే ముందు ఖచ్చితంగా దాన్ని తనిఖీ చేయండి.

డాష్‌బోర్డ్‌పై కాళ్లు పెట్ట‌కండి..

కో-డ్రైవర్ కదులుతున్న వాహనంలో డ్యాష్‌బోర్డ్‌పై తన కాళ్ల‌ను ఎప్పుడూ ఉంచకూడదు. ఇలా చేయడం ప్రమాదకరం. ఎయిర్‌బ్యాగ్ స్పీడ్‌గా తెరుచుకుని.. ఆ కారణంగా కాలు అద్దానికో.. పైభాగంలోనే తాకే అవ‌కాశం ఉంది. ఇందుకు సంబంధించిన పలు ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఎయిర్‌బ్యాగ్ లేకపోయినా డ్యాష్‌బోర్డ్‌పై కాలు పెట్ట‌డం మంచిది కాదు.

Next Story