ఫెర్టిలిటీపై చర్చను సమున్నతం చేయడానికి ఏకమైన ఫెర్టిలిటీ నిపుణులు

ఫెర్టీ9 ఫెర్టిలిటీ సెంటర్, విజయవాడ ప్రసూతి మరియు గైనకాలజికల్ సొసైటీ తో పాటుగా ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ సహకారంతో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  29 April 2024 2:30 AM IST
ఫెర్టిలిటీపై చర్చను సమున్నతం చేయడానికి ఏకమైన ఫెర్టిలిటీ నిపుణులు

ఫెర్టీ9 ఫెర్టిలిటీ సెంటర్, విజయవాడ ప్రసూతి మరియు గైనకాలజికల్ సొసైటీ తో పాటుగా ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ సహకారంతో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న "ఫెర్టిజ్ఞాన్" సదస్సును 2024 ఏప్రిల్ 28న నిర్వహించింది. సంతానోత్పత్తి పరిశ్రమకు ఒక ఆకృతిని అందించే కీలకమైన అంశాలను శోధించడానికి భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి గౌరవనీయమైన వైద్యులు మరియు నిపుణులు సమావేశమయ్యారు.

ఈ సదస్సు ఉదయం 9 గంటలకు ప్రారంభమైంది, సంతానోత్పత్తి సంరక్షణ యొక్క వివిధ అంశాలపై సమగ్ర చర్చలకు ఒక వేదికను ఇది అందించింది. విశిష్ట వక్తలు ప్రీకాన్సెప్షన్ కౌన్సెలింగ్ మరియు సంరక్షణ , వంధ్యత్వంలో జీవక్రియ ఆరోగ్యం యొక్క పాత్ర, సంతానోత్పత్తిలో కీహోల్ సర్జరీ, ART చట్టంపై గైనకాలజిస్ట్ యొక్క దృక్పథం, ఇటీవలి పురోగతి, పురుష భాగస్వామి మూల్యాంకనం, మెరుగైన ఫలితాల కోసం ఖచ్చితత్వం మరియు వంధ్యత్వంలో అల్ట్రా సోనోగ్రఫీ యొక్క వినియోగంపై పరిజ్ఙానం ను పంచుకున్నారు.

ఫెర్టి9 ఫెర్టిలిటీ సెంటర్‌లో ఫెర్టిలిటీ కన్సల్టెంట్ మరియు ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ సుమ వర్ష మాట్లాడుతూ, “రోగులు , నిపుణులు మరియు పరిశ్రమ మొత్తానికి ప్రయోజనం చేకూర్చేందుకు ఉద్దేశించిన అనేక కార్యక్రమాల ద్వారా సంతానోత్పత్తి రంగం పట్ల మా నిబద్ధత వెల్లడిస్తున్నాము. ముఖ్యంగా "ఫెర్టిజ్ఞాన్" విజయవాడ ఫెర్టిలిటీ కమ్యూనిటీలో నిర్మాణాత్మక చర్చను పెంపొందించడంలో గణనీయమైన పురోగతిని సూచిస్తుంది..." అని అన్నారు

పరిశ్రమకు చెందిన 182 మందికి పైగా వైద్యులు మరియు నిపుణులు హాజరైన ఈ కార్యక్రమంలో హాజరైన వారు విజ్ఞానం మరియు నైపుణ్యాన్ని మార్పిడి చేసుకునేలా సహకార వాతావరణాన్ని పెంపొందించారు. ఆకర్షణీయమైన ప్రెజెంటేషన్‌లు , ఇంటరాక్టివ్ సెషన్‌ల ద్వారా, కార్యక్రమంలో పాల్గొన్నవారు సంతానోత్పత్తి సంరక్షణలో తాజా పురోగతులు మరియు ఉత్తమ అభ్యాసాల గురించి విలువైన పరిజ్ఙానం పొందారు.

ఫెర్టి9 ఫెర్టిలిటీ సెంటర్ మెడికల్ డైరెక్టర్ మరియు ఆర్గనైజింగ్ చైర్‌పర్సన్ డాక్టర్ జ్యోతి సి బుడి మాట్లాడుతూ " సంతానోత్పత్తి నిపుణులు ఒకచోట చేరడానికి, అనుభవాలను పంచుకోవడానికి, రోగుల సంరక్షణను మెరుగుపరచడానికి మరియు ఈ ప్రాంతంలో సంతానోత్పత్తి సంరక్షణ రంగంలో పురోగతికి దోహదపడే వినూత్న విధానాలను అన్వేషించడానికి ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని ఫెర్టిజ్ఞాన్ అందించింది.." అని అన్నారు

Next Story