మహానటి సినిమాను చూడమని కోరిన దీపిక పదుకోన్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  29 May 2020 3:36 PM GMT
మహానటి సినిమాను చూడమని కోరిన దీపిక పదుకోన్

సావిత్రి బయోపిక్ గా తెరకెక్కిన 'మహానటి' సినిమా భారీ విజయాన్ని సాధించింది. దర్శకుడు నాగ్ అశ్విన్ ను తెలుగు ప్రజలందరూ మెచ్చుకున్నారు. ముఖ్యంగా మహానటి సావిత్రి పాత్రకు 'కీర్తి సురేష్' న్యాయం చేసింది. అచ్చం సావిత్రినే చూశాం అని ప్రేక్షకులు అన్నారు. ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది మహానటి సినిమా. ఈ సినిమాకు ఓ బాలీవుడ్ నటి కూడా ఫిదా అయిపోయింది. ఆమె మరెవరో కాదు బాలీవుడ్ క్వీన్ దీపిక పదుకోన్.

బాలీవుడ్ నటి దీపిక పదుకోన్ ప్రస్తుతం సెల్ఫ్ క్వారెంటైన్ లో తన భర్తతో కలిసి హాయిగా గడుపుతోంది. ముంబై లో తన ఇంట్లో ఉంటూ సినిమాలను చూస్తూ గడుపుతోంది. దీపిక తెలుగు సినిమా మహానటిని చూసింది. అవార్డు విన్నింగ్ సినిమా అయిన మహానటిని చూడాలంటూ తన ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో స్పష్టం చేసింది దీపిక..! అలాగే నాగ్ అశ్విన్ ను కూడా ట్యాగ్ చేసింది దీపిక. దీపిక పదుకోన్ తన సినిమా చూసి మెచ్చుకోవడంపై నాగ్ అశ్విన్ కూడా స్పందించాడు. ఉదయాన లేవగానే మంచి ఇంస్టాగ్రామ్ నోటిఫికేషన్ ను చూశానని అన్నాడు.

D1

2018లో విడుదలైన మహానటి సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అలాగే అవార్డుల పంట కూడా పండింది. నేషనల్ అవార్డులు, ఫిలింఫేర్ అవార్డులతో పాటు మరెన్నో అవార్డులు ఈ సినిమా సొంతమయ్యాయి. సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ పాత్ర మనల్ని కంటతడి పెట్టిస్తుంది. జెమిని గణేశన్ పాత్రలో దుల్కర్ సాల్మన్ నటన కూడా అద్భుతం. ఇక సమంత, విజయ్ దేవరకొండ, రాజేంద్ర ప్రసాద్, నరేష్ లు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. పలువురు స్టార్ హీరోల గెస్ట్ అప్పియరెన్స్ లు సినిమాకు మరింత ప్లస్ అయ్యింది.

D2

Next Story