Fact Check : రైతులకు మద్దతునిచ్చే నినాదం ఉన్న టీ షర్టుతో దీపిక ఎన్సీబీ విచారణకు హాజరైందా..?

By న్యూస్‌మీటర్ తెలుగు
Published on : 29 Sept 2020 4:10 PM IST

Fact Check : రైతులకు మద్దతునిచ్చే నినాదం ఉన్న టీ షర్టుతో దీపిక ఎన్సీబీ విచారణకు హాజరైందా..?

బాలీవుడ్ నటి దీపిక పదుకోన్ బాలీవుడ్‌లో డ్రగ్స్ రాకెట్ సంబంధాల విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటూ సెప్టెంబర్ 26న ఎన్సీబీ విచారణకు హాజరయ్యారు. దక్షిణ ముంబైలోని కొలాబా ఎన్సీబీ సిట్ గెస్ట్‌హౌస్‌కు ఆమె చేరుకొన్నారు.

దీపిక నలుపు రంగు టీషర్ట్ వేసుకుని ఎన్సీబీ విచారణకు హాజరైందంటూ సామాజిక మాధ్యమాల్లో ఓ పోస్టు వైరల్ అవుతోంది. ఆమె వేసుకున్న టీ షర్ట్ మీద “I STAND WITH INDIAN FARMERS” అన్న స్లోగన్ ఉందంటూ చెబుతూ ఉన్నారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా రైతులు రోడ్డెక్కి నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే..! అందులో భాగంగానే ఆమె విచారణకు హాజరవుతూ 'నేను రైతులకు మద్దతుగా ఉన్నాను' అనే నినాదం ఉన్న టీషర్టుతో వెళ్లిందని పలువురు పోస్టులు పెడుతూ వచ్చారు.

“When you report for questioning to the NCB, because you stood in solidarity with JNU… and carry swag on your T-shirt…” అంటూ ఫేస్ బుక్ లో పోస్టు కూడా పెట్టారు. అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను చూడొచ్చు.

01

https://m.facebook.com/photo.php?fbid=10164227604430176&set=a.10150204344595176&type=3&theater

నిజ నిర్ధారణ:

వైరల్ అవుతున్న పోస్టులో ఎటువంటి నిజం లేదు.

వైరల్ అవుతున్న పోస్టులో ఉన్న ఇమేజ్ ను తీసుకుని న్యూస్ మీటర్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసింది. అయితే ఇదే ఫోటో ఇండియన్ ఎక్స్ ప్రెస్ 2018లో పబ్లిష్ చేసింది. తన ఎంటర్టైన్మెంట్ గ్యాలరీలో నలుపు రంగు టీ షర్ట్ ను వేసుకుని అదే స్టిల్ తో దీపిక ఉంది. ఈ ఫోటో మీద ఎటువంటి టెక్స్ట్ కూడా లేదు. కానీ “I STAND WITH INDIAN FARMERS” అన్న నినాదాన్ని తాజాగా మార్ఫింగ్ చేశారు. అంతేకానీ వైరల్ అవుతున్న ఫోటోలో ఉన్నది నిజం కాదు.

రెండు ఫోటోల మధ్య ఉన్న తేడాను గమనించవచ్చు.

02

నార్కోటిక్స్ కంట్రోల్ బీయూరో డ్రగ్స్ తో సంబంధాలు ఉన్నాయంటూ పలువురు బాలీవుడ్ నటీమణులకు సమన్లను జారీ చేశారు. సమన్లు జారీ అయిన వారిలో దీపిక కూడా ఉంది. ఆమె సెప్టెంబర్ 26న విచారణకు హాజరైన ఫోటోలను పలు మీడియా సంస్థలు ప్రచురించాయి. వైరల్ అవుతున్న పోస్టులో ఉన్న డ్రెస్ లో దీపిక విచారణకు హాజరు కాలేదు.

03

వైరల్ అవుతున్న పోస్టుల్లో ఉన్న డ్రెస్ ను మార్ఫింగ్ చేశారు. ఈ పోస్టులు 'పచ్చి అబద్ధం'.

Next Story