దీనంత‌టికి 'రోహిత్ భాయ్' చెప్పిన ఆ మాటలే కార‌ణం.!

By Medi Samrat
Published on : 12 Nov 2019 3:41 PM IST

దీనంత‌టికి రోహిత్ భాయ్ చెప్పిన ఆ మాటలే కార‌ణం.!

టీమిండియా పేస్ బౌల‌ర్ జస్‌ప్రీత్‌ బుమ్రా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కెరీర్ ప్రారంభం నుండి ఇప్పటివరకూ తన బౌలింగ్‌తో ప్ర‌త్య‌ర్థుల‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తూ టీమిండియా ప్ర‌ధాన బౌల‌ర్‌గా రాణిస్తున్నాడు. అయితే.. బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు బుమ్రా గాయంతో తప్పుకోవడం వ‌ల‌న‌ దీపక్‌ చాహర్‌కు అవకాశం దక్కింది.

Image result for rohit sharma deepak chahar

అయితే.. చాహర్‌ త‌న‌కు అందివచ్చిన అవకాశాన్ని 'మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌'తో మరీ నిరూపించుకున్నాడు. చివరి మ్యాచ్‌లో హ్యాట్రిక్‌తో పాటు ఆరు వికెట్లు సాధించి 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' అవార్డును గెలుచుకున్నాడు. ఎనిమిది వికెట్లతో సిరీస్‌లో టాఫ్ బౌల‌ర్ గా నిలిచాడు.

Image result for rohit sharma deepak chahar

ఇదిలావుంటే.. బంగ్లాతో చివ‌రి మ్యాచ్‌లో త‌ప్ప‌నిస‌రిగా గెలువాల్సిన త‌రుణంలో మాత్రం.. చాహర్‌కు కెప్టెన్‌ రోహిత్‌ ఒక్క విషయం చెప్పాడట. ‘నువ్వు కీలక ఓవర్లు బౌలింగ్‌ చేయాల్సి ఉంటుంది. ఈ రోజుకి 'నువ్వే మా బుమ్రా'వి అని రోహిత్‌ చెప్పాడట‌. మ్యాచ్ అనంత‌రం మాట్లాడిన చాహ‌ర్.. రోహిత్‌ భాయ్‌ చెప్పిన ఆ మాటలే నాలో మరింత ప్రేరణ కల్గించాయి. నాపై పెట్టిన బాధ్యతను ఎప్పుడూ గౌరవంగానే భావిస్తాను. ఈ క్రమంలోనే 'నువ్వే మా బుమ్రా' అని భాయ్ అన్న మాట‌లు నాలో మరింత బాధ్యతను పెంచాయి’ అని చెప్పుకొచ్చాడు.

Next Story