భారత్‌లో తగ్గుతున్న కరోనా కేసులు.. తాజాగా ఎన్ని కేసులంటే..
By సుభాష్ Published on 19 Aug 2020 2:29 AM GMTముఖ్యాంశాలు
దేశంలో రికవరీ రేటు ఎక్కువ
ఐదు రోజులుగా తగ్గుతున్న కరోనా కేసులు
దేశంలో 27 లక్షలు దాటిన కేసులు
భారత్‌లో కరోనా కేసుల సంఖ్య మంగళవారం నాటికి 27 లక్షలు దాటిపోయింది. గడిచిన 24 గంటల్లో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య కంటే కోలుకున్నవారి సంఖ్యనే ఎక్కువగా ఉండటం కొంత ఊరట కలిగించే విషయమే. మంగళవారం కొత్తగా 55,079 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 57,937 మంది కోలుకున్నారు. అయితే ఈనెల 13న గరిష్ఠంగా 66,999 కేసులు నమోదు కాగా, ఆ తర్వాత ఒక్క రోజు మినహా కేసుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. దీంతో కరోనా బారిన పడినవారికంటే కోలుకున్నవారి సంఖ్య ఎక్కువగా ఉంది. గత రెండు రోజులుగా కొత్తగా 60వేల లోపే పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అయితే ఈ కేసులన్నీ శని, ఆదివారాలకు సంబంధించినవని, ఈ రెండు రోజుల్లో కేసుల సంఖ్య తగ్గినంత మాత్రనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని అనుకోకూడదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇక మంగళవారం నాడు 55,079 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 876 మంది మృతి చెందారు. ఇక కరోనా నుంచి 57,937 మంది కోలుకోగా, ఇప్పటి వరకు మొత్తం కోలుకున్నవారి సంఖ్య 19,77,779కి చేరింది. ఇక దేశంలో ఇప్పటి వరకు మొత్తం 51,797 మంది కరోనాతో మృతి చెందారు.
కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన లెక్కల ప్రకారం పరిశీలిస్తే.. ఇంత వరకు ఎన్నడు లేని విధంగా మంగళవారం రికవరీ రేటు ఎక్కువగా ఉంది. మొత్తం 19.77 లక్షల మంది కోలుకోగా, రికవరీ రేటు 73.18శాతం పెరిగింది. గత ఐదారు రోజుల్లో రికవరీ రేటు 90.73శాతం, మరణాల రేటు 1.53శాతం ఉంది. గత 24 గంటల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 3వేలకుపైగా తగ్గింది. ఇంత భారీ సంఖ్యలో యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గడం ఇదే మొదటిసారి.
కొత్త కేసులు | మరణాలు | మొత్తం కేసులు | మొత్తం మరణాలు | |
ప్రపంచం | 2,47,499 | 5,020 | 2,21,73,219 | 7,79,976 |
భారత్ | 55,079 | 876 | 27,02,742 | 51,797 |
తెలంగాణ | 1,682 | 8 | 93,937 | 711 |
ఏపీ | 9,652 | 88 | 3,06,261 | 2,820 |
భారత్‌లో గడిచిన 24 గంటల్లో..
24 గంటల్లో | మొత్తం | |
కేసులు | 55,079 | 27,02,742 |
మరణాలు | 876 | 51,797 |
కోలుకున్నవారు | 57,937 | 19,77,779 |