దేశంలో సంచలనం సృష్టిచిన నిర్భయ కేసులో దోషుల కథ సుఖాంతం కానుంది. ఏడేళ్లు సాగిన ఈ కేసు.. ప్రధాన నిందితులైన అక్షయ్‌ కుమార్‌, వినయ్‌ శర్మ, పవన్‌ గుప్త, ముఖేష్‌ లకు ఈనెల 22న ఉదయం 7 గంటలకు ఉరిశిక్ష వేయనున్నారు. ఈ దోషులకు మరణ శిక్ష అమలు చేసేందుకు కసరత్తు మొదలైంది.

ఇక కామాంధులకు ఉరి తీయడమే తరువాయి. కానీ ఉరిశిక్ష వేయాలంటే ఎన్నోప్రాసెస్‌ లు ఉంటాయి. అన్ని విధివిధానాలు పూర్తిచేశాకే ఉరిశిక్ష అమలు చేస్తారు. ఇక ఈ నలుగురి దోషులను ఉరివేసేందుకు తీహార్‌ జైలు సిబ్బంది ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు.

ఒక్కో దోషి ఎంత బరువు ఉంటాడో అంత బరువున్న వస్తువులను ఉపయోగించి ఉరి ట్రయల్స్‌ వేయనున్నారు. ఈ ఉరిశిక్ష ట్రయల్స్‌ మూడో నెంబర్‌ కారాగారంలో నిర్వహించేందుకు సిబ్బంది తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ట్రయల్స్‌  లో జైలు సూపరింటెండెంట్‌, వర్క్‌ డిపార్ట్‌ మెంట్‌ అధికారులు, ఇతర అధికారులు పాల్గొంటారని తెలుస్తోంది.

ఇక ఉరి తీతకు ఉపయోగించే తాళ్లను బక్సర్‌ జైలు నుంచి తెచ్చిస్తున్నారు. గతంలో అప్జల్‌ గురును జైలు నంబర్‌ 3లోనే ఉరి తీశారు. ఇప్పుడు ఈ నలుగురిని కూడా ఇదే నంబర్‌ లోనే ఉరి తీయనున్నారు. నలుగురిని ఒకే సారి ఉరితీయడం దేశంలోనే మొదటిసారి.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.