ఆరేళ్ల బాలిక హత్య కేసులో చిత్తూరు కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ బాలిక హత్య కేసులో దోషికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పువెలువరించింది. గత ఏడాది నవంబర్‌ నెలలో రఫీ అనే వ్యక్తి బాలికపై అత్యాచారం, హత్య పాల్పడ్డాడు. ఈ కేసును సీరియన్‌గా తీసుకున్న పోలీసులు విచారణను వేగవంతం చేశారు. కాగా, ఈ కేసులో దోషిగా తేలిన మహ్మద్‌ రఫీకి ఉరిశిక్ష విధించింది. అయితే చిత్తూరు జిల్లాలో పోక్సో చట్టం కింద అమలైన తొలి ఉరిశిక్ష ఇది. కాగా, తీర్పును హైకోర్టుకు పంపుతున్నట్లు, ఉరిశిక్ష అమలు తేదీని హైకోర్టు నిర్ణయిస్తుందని న్యాయమూర్తి పేర్కొన్నారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.