చెరువులో పడి ముగ్గురు చిన్నారులు మృతి
By సుభాష్ Published on 1 Oct 2020 11:17 AM GMTచెరువులో పడి ముగ్గురు చిన్నారులు మృతి చెందడం మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. రెక్కాడితే కానీ డొక్కాడని కూలీ కుటుంబంపై విధి వెక్కిరించింది. ఊరికి ఉపకారంలా ఉండే ఈ చెరువు రెండు కుటుంబాలను మాత్రం తీరని విషాదాన్ని మిగిల్చింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మనోహరాబాద్ మండలం దండుపల్లి గ్రామానికి చెందిన ముగ్గురు చిన్నారులు ఆడుకుంటూ ఇంటి పక్కనే ఉన్న చెరువులోకి దిగారు. ఈత రాకపోవడంతో పిల్లలు అందులోనే జల సమాధి అయ్యారు. మరో ఇద్దరు చిన్నారులు ఈదుకుంటూ ప్రాణాలలో బయటపడ్డారు.
మృతులు పిట్టల వాడకు చెందిన రవి, నవీన్, అఖిలగా గుర్తించారు. మృతులంతా పది సంవత్సరాల్లోపు ఉన్నవారే. పిల్లల మరణవార్త విన్న తల్లిదండ్రులు విషాదంలో మునిగిపోయారు. చిన్నారుల మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు .. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.