ముఖ్యాంశాలు

  • బ్రెజిల్‌లో పడవ మునిగి 18 మంది మృతి
  • అమెజాన్‌ అటవీ ప్రాంతంలో ఘటన
  • ఫెర్రీ అమెజాన్‌ ఉపనది జారిలో పడవ బోల్తా
  • 30 మంది గల్లంతు, 46 మందిని కాపాడిన సహాయ సిబ్బంది
  • కొనసాగుతున్న గాలింపు చర్యలు

బ్రెజిల్‌లో ఘోర పడవ ప్రమాదం జరిగింది. ఫెర్రీ అమెజాన్‌ ఉపనదిల జారిలో పడవ బోల్తా కొట్టి పూర్తిగా మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 18 మంది మృతి చెందారని బ్రెజిల్‌ అధికారులు తెలిపారు. మరో 30 మంది గల్లంతయ్యారు. అమెజాన్‌ అటవీ ప్రాంతంలో ఈ విషాద ఘటన సంభవించింది. జారీ నదిపై పడవలో ప్రయాణికులను తీసుకువెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

Deadly Boat accident.. 18 people killed

విషయం తెలుసుకున్న ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. 46 మందిని సహాయ సిబ్బంది రక్షించారు. గల్లంతైన వారి కోసం రెస్క్యై డైవర్లను గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదం పూర్తి స్థాయిలో దర్యాప్తు ప్రారంభించినట్లు బ్రెజిల్‌ నేవీ తెలిపింది. చనిపోయిన వారిలో ఏడు నుంచి పదకొండు ఏళ్ల వయస్సు గల బాలికలు ముగ్గురు ఉన్నాని అమాపా రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.

Deadly Boat accident.. 18 people killed

ప్రతీకాత్మక చిత్రం..

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.