ఘోర పడవ ప్రమాదం.. 18 మంది మృతి, మరో 30 మంది గల్లంతు
By అంజిPublished on : 3 March 2020 9:43 AM IST

ముఖ్యాంశాలు
- బ్రెజిల్‌లో పడవ మునిగి 18 మంది మృతి
- అమెజాన్ అటవీ ప్రాంతంలో ఘటన
- ఫెర్రీ అమెజాన్ ఉపనది జారిలో పడవ బోల్తా
- 30 మంది గల్లంతు, 46 మందిని కాపాడిన సహాయ సిబ్బంది
- కొనసాగుతున్న గాలింపు చర్యలు
బ్రెజిల్‌లో ఘోర పడవ ప్రమాదం జరిగింది. ఫెర్రీ అమెజాన్ ఉపనదిల జారిలో పడవ బోల్తా కొట్టి పూర్తిగా మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 18 మంది మృతి చెందారని బ్రెజిల్ అధికారులు తెలిపారు. మరో 30 మంది గల్లంతయ్యారు. అమెజాన్ అటవీ ప్రాంతంలో ఈ విషాద ఘటన సంభవించింది. జారీ నదిపై పడవలో ప్రయాణికులను తీసుకువెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
విషయం తెలుసుకున్న ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. 46 మందిని సహాయ సిబ్బంది రక్షించారు. గల్లంతైన వారి కోసం రెస్క్యై డైవర్లను గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదం పూర్తి స్థాయిలో దర్యాప్తు ప్రారంభించినట్లు బ్రెజిల్ నేవీ తెలిపింది. చనిపోయిన వారిలో ఏడు నుంచి పదకొండు ఏళ్ల వయస్సు గల బాలికలు ముగ్గురు ఉన్నాని అమాపా రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.
ప్రతీకాత్మక చిత్రం..
Also Read
ప్రాణం తీసిన ‘టిక్ టాక్’Next Story