మినరల్స్ ను అమ్ముకొని ఆదాయాన్ని సొంతం చేసుకోవాలని అనుకుంటూ ఉండడం.. భారతదేశ వారసత్వ సంపదను కొల్లగొట్టడమే..

ఆర్థిక వ్యవస్థ ఎప్పుడూ స్థిరంగా ఉండాలి. అంతేకానీ భవిష్యత్తు తరాలకోసం ఉంచకుండా ఖనిజాలను ఎప్పటికప్పుడు అమ్ముకుంటూ ఆర్థికరంగాన్ని అభివృద్ధి చేయాలని అనుకోవడం చాలా తప్పు. ఇప్పటికే వాతావరణంలో తీవ్రమైన మార్పులు వస్తూ ఉన్నాయి. ఇప్పటికే భూమి మీద ఉన్న ఖనిజాలను మానవులు పెద్ద ఎత్తున కొల్లగొట్టారు. రాబోయే తరాలు భూమి మీద నివసించగలవా లేదా అన్నది కూడా తెలియని పరిస్థితి. భవిష్యత్తు తరాలకు ఖనిజాలను ఇస్తామా లేదా అన్నది పక్కన పెడితే.. రాబోయే తరాలు ఈ భూమి మీద బ్రతుకుతాయా అన్నది కూడా పెద్ద సవాల్ గా మారింది.

ఎప్పటికప్పుడు ఖనిజాలను అమ్ముకుంటూ వెళుతుంటే.. మద్యానికి బానిసైన వ్యక్తి ఇంట్లో ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టినట్లే అవుతుంది. మన తర్వాతి తరాల అవసరం కోసం కనీసం ఆలోచించడం కూడా మానేసినట్లే అవుతుంది.

ప్రస్తుతం ఎలా వ్యవహరిస్తూ ఉన్నాం:

భారత జాతీయ మినరల్ పాలసీ 2019 ప్రకారం "natural resources, including minerals, are a shared inheritance where the state is the trustee on behalf of the people to ensure that future generations receive the benefit of inheritance." (https://bit.ly/2Xy5wyd). అని ఉంది.

సహజవనరులు అన్నవి భవిష్యత్తు తరాల కోసం ఉంచాలి. రాబోయే తరాలకు ప్రభుత్వాలు బాధ్యత వహించాల్సి ఉంటుంది. కానీ ప్రభుత్వాలు మాత్రం ప్రవర్తిస్తున్న తీరులో చాలా మార్పు ఉంది.

ఆయిల్, గ్యాస్ వంటి వాటిపై ప్రస్తుత ప్రభుత్వాలు అనుసరిస్తున్న తీరు చూస్తుంటే భవిష్యత్తు తరాలకు మిగిలేది కష్టంగా కనిపిస్తూ ఉంది. ఇప్పటికే భూమిని గుల్ల చేసేస్తూ ఉండగా.. రాబోయే తరాల కోసం సహజ వనరులు ఉంటాయా..? లేదా అన్నది కూడా పెద్ద అనుమానమే..! ప్రభుత్వాలు సహజవనరులను ఆదాయమార్గాలుగానే భావిస్తూ ఉన్నాయి. ఇప్పటికిప్పుడు అమ్ముకోవడమే పనిగా పెట్టుకున్నాయి. భవిష్యత్తు తరాలు ఏమైపోతే.. మాకేంటి అన్నట్లుగా తయారు అయ్యాయి ప్రభుత్వాలు.

సహజవనరులను వారి అసలైన విలువకంటే తక్కువగా అమ్ముతూ ఉన్నారు. లాబీయింగ్, పొలిటికల్ డొనేషన్స్, లంచాల కారణంగా తక్కువ ధరకే సహజవనరులను కట్టబెడుతూ ఉన్నారు. వేదాంత రిపోర్ట్స్ ప్రకారం 2004-2012 మధ్య ఎనిమిది సంవత్సరాల కాలంలో సాధారణ విలువకంటే 95 శాతం కంటే తక్కువగానే ఖనిజాలను గోవా ప్రభుత్వం కోల్పోయింది. https://bit.ly/39tFKQZ ఖనిజాలను అమ్ముకున్న వారు భారీగా లాభాలను ఆర్జించారు. దీనిపై ప్రభుత్వం కూడా పెద్దగా పట్టించుకోలేదు. ఆదాయం వచ్చింది కదా ఎంతో కొంత అనే ధోరణిలో ప్రభుత్వం నడిచింది. అంతేకానీ రాబోయే తరాలకు సహజ వనరులను ఉంచలేకపోయామని అసలు భావించలేదు.

అకౌంటింగ్ లో నష్టాలు, తప్పులు

ప్రపంచ వ్యాప్తంగా మైనింగ్ లో పెద్ద ఎత్తున నష్టాలను చవిచూస్తూ ఉన్నారు. https://bit.ly/2LjmDRV

ప్రభుత్వాలు మినరల్స్ నుండి ఆదాయాన్ని ఆర్జించడంలో విఫలమయ్యాయని ఐ.ఎం.ఎఫ్. తెలిపింది. యూకే, నార్వే వంటి దేశాలు కూడా మైనింగ్ ద్వారా ఆర్జించడంలో చాలా వరకూ తగ్గాయని అంటూ ఉన్నారు. పబ్లిక్ సెక్టార్ నికర విలువ కూడా బాగా తగ్గింది.

https://medium.com/@thefutureweneed/three-shocking-cases-of-public-wealth-destruction-15c5030cda51

https://bit.ly/3i81c21

మైనింగ్ ద్వారా వచ్చే నష్టాలను పూడ్చడం కూడా చాలా కష్టమే..! అందుకు ఎన్నో సమస్యలు ఉంటాయి. ఉదాహరణకు గోవా ప్రభుత్వం 100 రూపాయల విలువైన సహజ వనరులను 5 రూపాయలకే కట్టబెట్టింది.. అప్పుడు నష్టం 95 రూపాయలు. ఎవరికైతే మైనింగ్ కోసం అవకాశం ఇచ్చి ఉంటారో.. సదరు కంపెనీలు వీలైనంత త్వరగా సహజవనరులను లాగేసుకుని వెళ్లిపోవాలని అనుకుంటూ ఉంటాయి. ఇలా మైనింగ్ కారణంగా.. చెట్లు, జంతువులు, అడవి జాతుల వారూ బ్రతకడం చాలా కష్టంగా మారిపోతుంది.

ఒక వేళ మైనింగ్ విలువను ప్రభుత్వం 5 నుండి 10 పెంచినా ప్రభుత్వానికి ఆదాయం రెండింతలు అయ్యిందని చెప్పుకొంటాం కానీ.. వచ్చిన నష్టాన్ని మాత్రం గుర్తించలేరు. ముఖ్యంగా రాజకీయ నాయకుల కనుసన్నులలో ఈ మైనింగ్ భూతం బ్రతుకుతూ ఉంటుంది.

ప్రభుత్వాల అకౌంటింగ్ ప్రమాణాలు పెరిగే వరకూ, అడ్వైజరీ బోర్డుల్లో మార్పులు వచ్చే వరకూ సహజవనరుల విషయంలో ప్రభుత్వాలు మోసపోతూనే ఉంటాయి. సహజవనరుల ప్రాముఖ్యతను, అసలైన విలువను ప్రజలు కూడా గుర్తించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న జనరేషన్ కు మాత్రమే సహజ వనరులు అన్నది భూమి మీద లేదు.. రాబోయే తరాల కోసం కూడా సహజవనరులను ఉంచాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద కూడా ఉంది. ప్రభుత్వాలను ప్రశ్నించాల్సి ఉంది. ఇప్పుడు ప్రభుత్వానికి ఆదాయం తెప్పిస్తున్నాయి కదా అని అనుకుంటే మాత్రం రాబోయే తరాలకు అన్యాయం చేసినట్లే అవుతుంది.

https://bit.ly/2LIEJNd

ఎలా నిర్వహించాలి:

సహజవనరులను భవిష్యత్తు తరాలకు కూడా దక్కేలా మనం చర్యలు తీసుకోవాలి. ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకుంటే మన పిల్లలు.. వారి పిల్లలకు కూడా సహజవనరులు లభించే అవకాశం ఉంది. అంతేకాకుండా ఎవరు పడితే వారు దోచుకుని వెళ్ళడానికి, ఇతరులు సొంతం చేసుకునేలా, వ్యర్థంగా మిగిలిపోయేలా ఉంచకూడదు.

ఒక వేళ ప్రభుత్వాలు సహజ వనరులను ఇతరులకు ఇవ్వాలని అనుకున్నా కూడా వాటిని నిర్దేశిత ధరకు అమ్మాలి.. ఖచ్చితమైన లాభాన్ని ప్రభుత్వం తీసుకోవాలి. ఎటువంటి నష్టమైనా.. అది భవిష్యత్తు తరాలపై పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వాలు, ప్రజలు నష్టపోకూడదు. భారత జాతీయ మినరల్ పాలసీ 2019 లో కూడా ఇదే విషయాన్ని తెలిపింది: "State Governments will endeavour to ensure that the full value of the extracted minerals is received by the State." సహజవనరుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని భవిష్యత్తు తరాల కోసం వినియోగించాలి.

నార్వే దేశం సహజవనరులను అమ్మడం ద్వారా వచ్చిన ఆదాయాన్ని భవిష్యత్తు తరాల నిధి కోసం వినియోగించడం జరిగింది. నేషనల్ పెన్షన్ స్కీమ్ ఫ్రేమ్ వర్క్ కోసం ఆదాయాన్ని కేటాయించారు.

2014 లో సుప్రీం కోర్టు కూడా అందుకు సంబంధించి గోవా ఐరన్ ఓర్ పర్మనెంట్ ఫండ్ కోసం కేటాయించింది. అందులో 500 కోట్ల రూపాయలు కార్పస్ ఫండ్ ఉంది. — Goa Foundation vs UOI & Ors., WP (civil) 435 of 2012, judgment on April 21, 2014 (https://bit.ly/2Kts4gA).

ఈ ఫండ్ ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రజల కోసం ఖర్చుపెట్టనున్నారు. అలాగే రాబోయే తరాల కోసం వాటిని వినియోగించనున్నారు.

న్యాయబద్ధమైన మైనింగ్ కోసం:

న్యాయబద్ధమైన మైనింగ్ విషయంలో పెట్టుబడిని ఎప్పటిలాగే నిర్వహించాలి. ఎప్పటికప్పుడు సేవింగ్స్ ద్వారా అవసరమైన ఫండ్ ను కొనసాగించాలి. ఫండ్స్ ను ఇన్వెస్ట్ చేయగా రిటర్న్స్ వస్తున్నాయో లేదో కూడా గమనిస్తూ ఉండాలి. యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. బడ్జెట్ ను మైనింగ్ ద్వారా ఆదాయం వస్తుందని పొందుపరచకూడదు.

ఈ చర్యలను తీసుకుంటే న్యాయబద్ధమైన మైనింగ్ చేయడానికి వీలుగా ఉంటుంది. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావంతో సహజవనరులను భవిష్యత్తు తరాల కోసం ఉంచవచ్చు. మైనింగ్ లో చోటు చేసుకునే నష్టాలను పూడ్చడం ద్వారా అవినీతిని కూడా నిర్మూలించవచ్చు. ముఖ్యంగా భవిష్యత్తు తరాల కోసం సహజవనరులను ఉంచిన వాళ్ళం అవుతాం. ఈ భూమి మీద మరిన్ని తరాలు బ్రతకాలి అనుకుంటే ఇలాంటి చర్యలు తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది.

- Rahul Basu is the Research Director at the Goa Foundation and a member of 'The Future We Need', a global movement to make intergenerational equity foundational for civilisation beginning with minerals


Medi Samrat

A self-motivated and inspired journalist with a passion for telling truth and delivering meaningful news to the public. Over six-plus years of experience in delivering top-notch content to digital and print media. Highly active on social media by engaging the public with unique stories. Kickstarted his career as a reporter at Andhra Prabha for two years and later joined as a sub-editor in Bhaarat Today for two years where he learned and explored the news space differently. Presently, he working as news editor for NewsMeter Telugu. He says working at NewsMeter Telugu helped him to unleash his potential and one of the best journeys of his career in learning new things on a daily basis.

Next Story