బిగ్‌బ్రేకింగ్ : విద్యాసంస్థలకు 19వరకూ సెలవులు పొడిగింపు
By Medi Samrat
టీఎస్ ఆర్టీసీ సమ్మె నేఫథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విద్యాసంస్థలకు అక్టోబర్ 19 వరకు సెలవులు పొడిగించింది. సెప్టెంబర్ 28నుండి అక్టోబర్ 14వరకు విద్యా సంస్థలకు దసరా సెలవులు ప్రకటించారు. అయితే పండుగ సమయంలోనే ఆర్టీసీ కార్మికులు సమ్మె చేపట్టడం.. సమ్మె విరమణ జరుగకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో విద్యాసంస్థల సెలవులు ముగియడంతో.. ప్రభుత్వం నేడు సెలవులను 19వరకు పొడిగిస్తున్నట్టు ప్రకటించింది.
19న తెలంగాణ బంద్
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరుతూ తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె ఎనిమిదో రోజుకు చేరుకుంది. సమ్మెను మరింత ఉధృతం చేసే దిశగా కార్యాచరణను ప్రకటించాయి. ఈ నెల 19న ఆర్టీసీ జేఏసీ, అఖిలపక్ష పార్టీలు తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ నెల 13న రాష్ట్రవ్యాప్తంగా వంటా వార్పు కార్యక్రమం, 14న ఆర్టీసీ డిపోల ఎదుట బహిరంగ సభలు, 15న రాస్తారోకోలు, 16న విద్యార్థుల ర్యాలీలు, 17న ధూందాం కార్యక్రమాలు, 18న బైక్ ర్యాలీలు చేపట్టాలని జేఏసీ నిర్ణయించింది.