దసరాకు ప్రత్యేక బస్సులు.. ఏయే రూట్ల నుంచి ఏ బస్సులు
By సుభాష్ Published on 20 Oct 2020 4:16 AM GMTదసరా, దీపావళి పండగలు వచ్చేస్తున్నాయి. దసరా పండగ సందర్భంగా ప్రజలు తమ తమ సొంతూళ్లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే నష్టాల్లో ఉన్న ఆర్టీసీ.. లాభాలు సమకూర్చుకునేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తోంది. కరోనా మహమ్మారి కారణంగా లాక్‌డౌన్‌తో ఆర్టీసీ తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. దీంతో పండగ సందర్భంగా ప్రత్యేక బస్సులను నడుపుతోంది తెలంగాణ సర్కార్. ఇందులో భాగంగా 3 వేల బస్సులను అదనంగా నడిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రద్దీకి అనుగుణంగా మరిన్ని బస్సులు పెంచి ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేరుస్తామని తెలంగాణ ఆర్టీసీ రంగారెడ్డి రీజియం ఆర్‌ఎం వరప్రసాద్ వెల్లడించారు.
ఏఏ రూట్ల నుంచి బస్సులు..
జూబ్లీ బస్‌స్టేషన్, జేబీఎస్ నుంచి : నిజామామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాలకు చెందిన బస్సులు
ఉప్పల్ క్రాస్ రోడ్, ఉప్పల్ బస్ స్టేషన్ నుంచి: యాదగిరిగుట్ట, జనంగా, నర్సంపేట, మహబూబాబాద్, పరకాల, తొర్రూర్, వరంగల్ వైపు వెళ్లే బస్సులు
దిల్‌సుఖ్‌నగర్ నుంచి : మిర్యాలగూడ, కోదాడ, నల్గొండ, సూర్యాపేట వైపు వెళ్లే బస్సులు
ఎంజీబీఎస్ నుంచి..
ఫ్లాట్ ఫారం 10 నుంచి13 వరకు ఖమ్మం, 14 నుంచి 15 వరకు దిల్‌సుఖ్‌నగర్, ఎల్‌బీ నగర్‌కు. అలాగే 18,19 ఫ్లాట్ ఫారాలు ఉప్పల్ క్రాస్ రోడ్‌కు, 23 నుంచి 25 వరకు పాతాల గంగ, కల్వకుర్తి వైపు బస్సులు. 26 నుంచి 31 ఫ్లాట్ ఫారాల నుంచి రాయచూర్, మహబూబ్‌నగర్ వైపు. 32 నుంచి 34 నుంచి నాగర్ కర్నూలు,షాద్ నగర్, అలాగే 35-36 రామాపురం. 41-42 పెబ్బేర్, కొత్తకోట, గద్వాల్ బస్సులు. 46-47 మెదక్, బాన్సువాడ, బోధన్ వైపు వెళ్లే బస్సులు. 48-52 జహీరాబాద్, బీదర్, సంగారెడ్డి, నారాయణఖేడ్. 53-55 జేబీఎస్ వైపు వెళ్లే బస్సులు. 56-58 నాగ్‌పూర్, అమరావతి, నాందేడ్, అకోలా, 62 నుంచి దేవరకొండ, 63-65 ఫ్లాట్ ఫారాల నుంచి తాండూరు, వికారాబాద్ వైపు ప్రత్యేక బస్సులు నడుస్తాయి.