దక్షిణాఫ్రికా కొంపముంచుతున్న 'కోల్ఫాక్' డీల్.. తాజాగా మరో ఆటగాడు ఔట్..
By తోట వంశీ కుమార్ Published on 28 March 2020 11:25 AM GMTకోల్పాక్ డీల్ దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టును బాగా దెబ్బతీసుకుంది. ఈ డీల్ కారణంగా ఇప్పటికే చాలా మంది ప్రతిభావంతమైన ఆటగాళ్లను కోల్పోయిన సౌతాఫ్రికాకు తాజాగా మరో ఆటగాడు గుడ్‌బై చెప్పాడు.
కోల్పాక్ డీల్.. జాతీయ జట్టుకు ఆడమని పేర్కొంటూ, కౌంటీ క్రికెట్లో ఆడేందుకుగానీ, ఇతర దేశాలకు వలస వెళ్లడాన్నిగానీ కోల్పాక్ డీల్ అంటారు. సాధారణంగా ఇంగ్లాండ్ లో ఆడడం కోసం చాలామంది ఈ డీల్ ద్వారా వెళతారు. వీళ్లను కోల్పాక్ ప్లేయర్లు అని అంటారు.
ఇలా వెళ్లిన ఆటగాళ్లు నాలుగేళ్ల పాటు కౌంటీ జట్లకు ఆడుతారు. ఆతరువాత వారికి అక్కడి జాతీయ జట్టులో ఆడే అవకాశం లభిస్తుంది. దీని కారణంగా ఇప్పటికే సౌతాఫ్రికాకు చెందిన చాలా మంది నాణ్యమైన ప్లేయర్లు విదేశాలకు తరలి వెళ్లారు. కైలీ అబౌట్, మోర్నీ మోర్కెల్,రిలీ రొసౌ, వెర్నన్ ఫిలాండర్ లాంటి ఆటగాళ్లు ఇప్పటికీ సౌతాఫ్రికా జట్టు నుంచి నిష్క్రమించారు.
తాజాగా ఈ డీల్ కారణంగా మరో క్రికెటర్ రిటైర్మెంట్ ప్రకటించాడు. డేన్ పియట్ తాజాగా అమెరికా జట్టుకు ఆడాలని నిశ్చయించుకుని.. ప్రొటీస్‌కు రిటైర్మెంట్ ప్రకటించినట్లు తెలిపాడు. ఇతను జాతీయ జట్టు తరఫున 9 టెస్టులు ఆడాడు. ఇరవై ఆరు వికెట్లు తీశాడు. సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్లో తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని పియట్ ప్రకటించాడు. తాను అమెరికాకు వెళ్లి, అక్కడ క్రికెట్ ఆడతానని, అలాగే జాతీయ జట్టు తరపున ఆడేందుకు ప్రయత్నిస్తానని పేర్కొన్నాడు.
�