ఆ విష‌యం భార‌త క్రికెట‌ర్ల‌కి ముందే తెలుసు : ర‌విశాస్త్రి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 March 2020 5:15 AM GMT
ఆ విష‌యం భార‌త క్రికెట‌ర్ల‌కి ముందే తెలుసు : ర‌విశాస్త్రి

ద‌క్షిణాఫ్రికాతో వ‌న్డే సిరీస్ స‌మ‌యంలో క్రీడ‌లు స్తంభించి పోయే అవ‌కాశం ఉంద‌ని టీమ్ఇండియా క్రికెట‌ర్ల‌కు ముందే తెలుసున‌ని కోచ్ ర‌విశాస్త్రి అన్నారు. తాజాగా ఆయ‌న స్కై క్రికెట్‌తో మాట్లాడారు. ప్ర‌పంచ వ్యాప్తంగా వైర‌స్ విస్త‌రిస్తున్న వేళ, ముఖ్యంగా భార‌త్‌లో వ్యాప్తి చెందుతున్న స‌మ‌యంలోనే టీమ్ఇండియా కివీస్ ప‌ర్య‌ట‌న నుంచి తిరిగొచ్చింద‌ని అన్నాడు.

అంత‌క ముందు భార‌త్ కివీస్‌లో ఐదు టీ20లు, మూడు వ‌న్డేలు, రెండు టెస్టులు ఆడింది. సుదీర్ఘ ప‌ర్య‌ట‌న అనంత‌రం మార్చి తొలి వారంలో స్వ‌దేశానికి వ‌చ్చిన టీమ్ఇండియా మార్చి 12 నుంచి 18 వ‌ర‌కు ద‌క్షిణాఫ్రికాతో మూడు వ‌న్డేల సిరీస్ ఆడాల్సి ఉంది. అయితే.. వ‌ర్షం కార‌ణంగా ధ‌ర్మ‌శాలలో తొలి వ‌న్డే వ‌ర్షం కార‌ణంగా ర‌ద్దు అయ్యింది. రెండు వ‌న్డే ముందు సిరీస్‌ను వాయిదా వేశారు. ఈ విష‌యం పై ర‌విశాస్త్రి మాట్లాడుతూ.. అది త‌మ‌కు షాకింగ్‌గా అనింపించింద‌ని, నిజం చెప్పాలంటే.. దక్షిణాఫ్రికా సిరీస్‌కు స‌న్న‌ద్ద‌మ‌వుతున్న‌ప్పుడే వైర‌స్ ప్ర‌భావాన్ని ఊహించామ‌ని, వైర‌స్ ప్ర‌భావం ఎక్కువ‌గా ఉంద‌ని తెలిసి ఏదో జ‌రుగుతుంద‌ని ఊహించామ‌న్నాడు.

క‌రోనా వైర‌స్ కార‌ణంగా అన్ని ర‌కాల క్రికెట్ మ్యాచ్‌లు ర‌ద్దు అయిన సంగ‌తి తెలిసిందే. దీనిపై శాస్త్రి మాట్లాడుతూ.. ఈ బ్రేక్ ఆటగాళ్లకి మంచే చేయనుందని అభిప్రాయపడ్డాడు.

‘‘భారత క్రికెటర్లకి దొరికిన ఈ రెస్ట్ మంచిదే. ఎందుకంటే.. ఇటీవల న్యూజిలాండ్ పర్యటనలో సుదీర్ఘ సిరీస్ ఆడారు. ముఖ్యంగా.. మూడు ఫార్మాట్ల(వన్డే, టీ20, టెస్టు)లలో ఆడిన క్రికెటర్లు మానసికంగా, శారీరకంగా చాలా అలసిపోయారు. గత 10 నెలల నుంచి టీమిండియా వరుసగా సిరీస్‌లు ఆడుతూనే ఉంది. కాబట్టి.. ఈ బ్రేక్‌‌లో క్రికెటర్లు రీఛార్జ్ అయ్యి.. ఫ్రెష్‌గా మళ్లీ మైదానంలోకి అడుగుపెడతారు’’ అని రవిశాస్త్రి వెల్లడించాడు.

2019 వన్డే ప్రపంచకప్ నుంచి దాదాపు 10 నెలల పాటు భారత్ జట్టు వరుసగా సిరీస్‌లు ఆడుతూ వస్తోంది. ఎంతలా అంటే..? ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌ ఆడిన భారత్ జట్టు.. కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే న్యూజిలాండ్ గడ్డపైకి వెళ్లి ఐదు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టుల సిరీస్‌ని ఆడింది. దీంతో.. కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా బిజీ షెడ్యూల్‌పై పెదవి విరిచిన విషయం తెలిసిందే. అయితే.. కరోనా వైరస్ రూపంలో క్రికెటర్లకి ఊహించని విధంగా రెస్ట్ లభిస్తోంది. మార్చి 29 నుంచి ప్రారంభంకావాల్సిన ఐపీఎల్ 2020 సీజన్‌ని ఏప్రిల్ 15కి బీసీసీఐ వాయిదా వేయడంతో అప్పటి వరకూ క్రికెటర్లకి విశ్రాంతి దొరకనుంది.

Next Story