ఢిల్లీ : నార్త్ కోస్ట్ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఐఎండీ హెచ్చరించింది. ముఖ్యంగా ఒడిశాను 'బుల్ బుల్' హిట్ చేయనుందని తెలిపింది. ముఖ్యంగా పూరీ, కేంద్రపార, భద్రక్, జగస్తీపూర్‌లను ఎటాక్ చేయనుందని సమాచారం.
పశ్చిమ బెంగాల్‌పై కూడా 'బుల్ బుల్' ప్రభావం ఉండనుంది. 24 పరగణాల జిల్లా, ఈస్ట్ వెస్ట్ మిడ్నాపూర్ జిల్లాలకు కూడా వాతావరణాధికారులు హెచ్చరికలు జారీ చేశారు.సైక్లోన్ తీరాన్ని తాకే సమయంలో 120 నుంచి 170 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.